ఇంత కంటే దారుణం ఇంకోటి ఉంటుందా?..అందరి చూస్తుండగానే అతని బుగ్గ కొరికేసిన హాట్ బ్యూటీ..!

Movie News

ఈ మధ్య కాలం లో రియాలిటీ షో లైన కామెడీ షో లైన ఎక్కడ ఏ షో లో చూసిన కూడా హద్దులు దాటుతున్న మాటలు చూస్తున్నాం, హద్దులు దాటుతున్న చేష్టలు చూస్తున్నాం. అయితే ఇది అక్కడికే ఆగట్లేదు రాను రాను ఎన్నో దరిద్రాలను ఈ షోస్ లో చూడాల్సి వస్తుంది. ఇంతవరకు ఎవరైనా బాగా డాన్స్ చేస్తే చప్పట్లు కొట్టేవారు, నిలబడి అభినందించేవారు . మరీ బాగా నచ్చితే వాళ్లతో కలిసి డాన్స్ చేయడం చూసాం లేదా హాగ్ చేసుకోవడం చూసాం.

కానీ అవి ఒకప్పుడు, ఇప్పుడు ట్రెండ్ మారింది. పెర్ఫార్మన్స్ నచ్చితే ఏకంగా బుగ్గలు కొరికేస్తున్నారు. ఈ దరిద్రం ప్రముఖ పాపులర్ ఢీ డాన్స్ షో లో జరిగింది. ఓ డాన్స్ పర్ఫర్మ్యాన్స్ తెగ నచ్చి నేరుగా వెళ్లి జెడ్జి పూర్ణ గారు అతని చంప కొరికింది.

ఇలాంటి పాపులర్ షో లో ఏంటి ఈ దరిద్రం అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. అది ఒక టాలెంట్ షో అని మరిచిపోయి మరి నీచంగా తయారవుతున్నారంటూ చివాట్లు పెడుతున్నారు.ఇలాంటి షోలు చిన్న పిల్లలు కూడా చూస్తారు ఏదైనా నేర్చుకుందాం అని చేసే వారికి ఇలాంటివి అవసరమా అంటున్నారు.

  

ఢీ షో కి భారత దేశం మొత్తం లో మంచి గుర్తింపు ఉంది. ఇండియా లోనే ఒక గొప్ప డాన్స్ షో గా ఢీ షో గుర్తింపు సంపాదించుకుంది.

ఆ స్థాయికి చేరుకోడానికి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డారు నిర్వాహకులు. కానీ ఈ మధ్య కాలంలో ఆది డబల్ మీనింగ్ డైలాగులు, హద్దులు దాటినా ముద్దులు తప్ప ఇంకేం కనిపించట్లేదు ఆ షో వీడియో ప్రోమోలల్లో . దీంట్లో జబర్దస్త్ లో పని చేసే కమెడియన్లు సుధీర్ మరియు హైపర్ ఆది లు మెంటార్లు గా ఉంటున్నారు.

మరియు ఇంకోవైపు రష్మీ , దీపికా పిల్లి కూడా కో యాంకర్లు గా ఉంటూనే మెంటర్లుగా ఉంటున్నారు ఈ షోను ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అసలు ఇలాంటి డాన్స్ షోలకు కామెడియన్లే అవసరమే లేదు అనుకుంటుంటే, ఇప్పుడు జెడ్జ్ లో కూడా మరి దారుణంగా తయారవుతున్నారు.జనాలు కూడా అలంటి సీన్లు ప్రోమో వీడియో లో లేనిదే షోను చూడట్లేదు, కాబట్టి నిరవాహకులకు వేరే మార్గం లేక ఇలాంటి సీన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. రాను రాను ఇంకెన్ని దరిద్రాలు చూస్తామో.

అందరి ముందే అతనికి ముద్దు పెట్టిన జడ్జి పూర్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *