గత కొంత కాలంగా పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న టిక్కెట్లు పోర్టల్ ద్వారా అమ్ముతామన నిర్ణయాన్ని బట్టి సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తో ప్రారంభమైన , ఈ మాటల యుద్ధము,రాను రాను పెద్ద గాలివాన లాగా మారింది,
మొదట్లో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద సినిమా వ్యక్తులను నోటికి ఇష్టం వచ్చినట్టుగా సంబోధిస్తూ మాట్లాడని , ఏవిధంగా మాట్లాడాలో పవన్ కళ్యాణ్ కి తెలియదు అని ఎంతోమంది మండిపడ్డారు వారిలో పోసాని కృష్ణ మురళి ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పైన ఘో రెచ్చి పోయాడు మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీసి తీవ్రమైన ఆరోపణలు చేశాడు, పోసాని చేసిన వ్యాఖ్యలకు పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ పోసానినీ బూతులు మాట్లాడుతూ చంపేస్తామని హెచ్చరిక చేస్తున్నారు, కొంతమంది అభిమానులు పోసాన్ని భార్యను ఇష్టమొచ్చినట్టుగా సంబోధిస్తూ తనతో తన భార్య గురించి అవమానకరంగా మాట్లాడారని ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అదే తీరులో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడారు తన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కొంతమంది సినిమా ప్రముఖులు పోసాని పైన విరుచుకు పడ్డారు, తాను అలా మాట్లాడినందుకు కొంతమంది అభిమానులు పోసాని కృష్ణ మురళి ఇంటి పైకి రాళ్లు రువ్వారు , ఈ తరుణంలో లో నాకు ఏదైనా జరిగితే దాన్ని పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ దే అంటూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు.
అయితే ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి కొరకు జరుగుతున్న ఓట్ల నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు ఎలక్షన్ పైన కూడా కొంతమటుకు ప్రభావం చూపించింది. అయితే తే ఎలక్షన్లో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రత్యర్థులు కూడా పోసాని కృష్ణ మురళి గారి మాటలను ఖండించారు అదే రీతిగా మనందరం ఒక కుటుంబం అందరం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలా రెచ్చిపోయి విమర్శలు చేసుకోవడం వల్ల చిత్ర పరిశ్రమ అంటే జనాల్లో చులకన భావం కలుగుతుందని, అలాగా విమర్శించుకుంటూ ఉన్నట్టయితే చిత్ర పరిశ్రమ పరువు పోతుందని తెలియజేశారు.
మరియు కొంతమంది సినిమా పెద్దలు పోసాని ప్రవర్తించిన తీరును బట్టి ఆయన చేసిన విపరీతమైనటువంటి వ్యాఖ్యలను బట్టి కచ్చితంగా పోసాని కృష్ణ మురళి పర్యవసానాన్ని ఎదుర్కోవాలని స్పందించారు. అయితే ఈ స్పందన గాను పోసాని పై చిత్రపరిశ్రమ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం వెలువడింది ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళి పైన సినీ పరిశ్రమ నుండి సుమారు ఐదు సంవత్సరాల వరకు నిషిద్ధం విధించాలనే ఆలోచనలో కొంతమంది నిర్మాతలు ఉనట్టలు తెలుస్తోంది , అయితే ప్రస్తుతం మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఎలాంటి విధమైనటువంటి చర్య ప్రస్తుతం తీసుకోలేరని ఎలక్షన్ తర్వాత అధికారికంగా లేదా అనధికారికంగా కృష్ణమురళి కి వేటు పడబోతుంది అని నిఘా వర్గాల విశ్లేషణ.