సినీ ఇండస్ట్రీ అంటే కెరియర్ నీ బ్యాలెన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన ఆలోచనలు సరైన లైన్లో లేనట్లయితే ఎప్పుడూ టాప్ పొజిషన్ నుండి పడిపోతారో తెలియదు. అలా గొప్ప పేరు సంపాదించి ఇప్పుడు కనుమరుగైపోయిన యాక్టర్లు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.
ఒక సినిమా ఒప్పుకున్నాము ఉంటే పాత్ర విషయం లో లేదా కథ విషయంలో సరైందా కాదా ఆ పాత్ర చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ప్రతి పాయింట్ని ఆలోచించి జాగ్రత్తపడాలి. ఒకవేళ మన నిర్ణయం సరైంది కానట్లయితే కెరియర్ ఎలా ఉండబోతుందో ఊహించడం చాలా కష్టం ప్రస్తుత ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు ప్రభుదేవా గారు
ప్రభుదేవా గారు అంటే ఎవరో తెలియని వారు ఉండరు.

భారతీయ సినిమా ప్రపంచంలో మంచి డాన్సర్లలో ఒకరు ప్రభుదేవా గారు. ఈయన తెలుగు ప్రపంచానికి సుందరం మాస్టర్ కుమారుడుగా పరిచయం . అలాగే మంచి యాక్టింగ్ తో ప్రజలను మెప్పించిన హీరో. సుమారు 15 సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించి 4 సూపర్ హిట్లు సంపాదించుకున్నాడు.
ప్రభుదేవా దక్షిణాదిలో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి ప్రజల అభిమానాన్ని పొందుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్టై బాలీవుడ్ వరకు వినిపించ్చాయి ఆ రీతిగా ప్రభుదేవా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ప్రభుదేవా డైరెక్టర్ గా మారి అద్భుతమైన సినిమాలు భారతీయ ప్రేక్షకులకు అందించి గొప్ప అభిమానాన్ని కూడ బెట్టుకున్నాడు. పెద్దపెద్ద యాక్టర్ ల సినిమాలకు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించాడు.
అయితే ఈ మధ్య కాలంలో ప్రభుదేవాకు అసలు కలిసి రావడం లేదు తాజాగా బారి బడ్జెట్ తో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని హీరోగా పెట్టి తీసిన రాధే సినిమా ప్రేక్షకులను ఆదరించ లేకపోయింది ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయినప్పటికీ పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ రాలేకపోయింది తద్వారా సినిమా ప్రభుదేవాకు ఫ్లాప్ నీ మిగిలించింది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ తో తీసిన సినిమా దబాంగ్ 3 కూడా ఇదే రీతిగా ఫ్లాప్ అవ్వడం వల్ల ప్రభుదేవా అంటే ఫ్లాప్ డైరెక్టర్ అని పేరు పడిపోయింది. ఈ రెండూ ఫ్లాపుల తర్వాత ప్రభుదేవా గారు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రేక్షకులైతే బాలీవుడ్ లో ప్రభుదేవా పని అయిపోయింది అంటూ విమర్శిస్తున్నారు. దీంతో దక్షిణ భారత ప్రేక్షకులు ప్రభుదేవా కెరియర్ ఆగిపోయిందా అని కలవరపడుతున్నారు.