సినీ పరిశ్రమలో అధ్యక్ష పదవి కొరకు జరుగుతున్న మా అసోసియేషన్ ఎలక్షన్ లో. ఒకరి పైన ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అలాగే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఒక వర్గం వారు మరొక మార్గాన్ని విమర్శిస్తున్నారు.
ఇదే అంశం పైన ప్రకాష్ రాజ్ ప్యానెల్ వారు ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. జీవిత గారు మాట్లాడుతూ మంచు విష్ణు ప్యానెల్ వారు ప్రజలను పెద్దవాళ్ళ పేర్లతో మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అని అన్నారు. ప్రజలందరూ కచ్చితంగా ఈ విషయం పైన ఆలోచించాలని వోట్ అనేది మన హక్కు ఇదే మన భవిష్యత్తు అని చెప్తూ ఫలానా మంచు విష్ణు ఫోన్ చేశాడని మోహన్ బాబు గారు ఫోన్ చేశారని ఓటు వేయకండి అన్నారు. అలాగే గొప్ప వాళ్లకు ఓట్లతో సంబంధం ఉండదు ఎవరు గెలిచినా మేము బాగానే ఉన్నాము అనుకుంటారు లెనోడు మాత్రమే ఎవరికి ఓటు వెయ్యాలో ఆలోచించి వేస్తారని వారికి నిజమైన అవసరాలు ఉంటాయని అన్నారు.
ఆ తర్వాత ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఎప్పుడూ లేని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సిస్టం ఈసారి మా ఓట్లలో చేర్చబడింది అని ఎలక్షన్ ఆఫీసర్ గారు తెలియజేసినప్పుడు చాలా సంతోషించాము, ఈ సిస్టం ద్వారా వచ్చి ఓట్లు వియలేని 60కి పై వద్ద పెద్దవారు ఇంటి వద్దనే ఉండి ఓటు వేసుకునే సౌలభ్యం ఉంటుందని అందుకు మేము మొదట్లో సంతోషించాము అయితే ఇప్పుడు ఈ అంశం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసి కంప్లైంట్ ఇచ్చామని అన్నారు.
ఎలక్షన్ కమిటీ వారు మాకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మిస్ యూస్ చేయబడ్డాయి అని ప్రస్తావించాడు. ఆ రూల్స్ ప్రకారం ఎవరైతే 60 ఏళ్లు పైబడి ఉన్నారో వాళ్ళు ఒక లెటర్ రాసి తమ తమ మెంబర్షిప్ నంబర్ రాశి తమ అడ్రస్ కూడా రాసి ఎలక్షన్ ఆఫీసర్ కి 30 తారీకు లోపల పంపించాలి. ఆ తర్వాత పంపబడ్డ ప్రతి లెటర్ ను పరిశీలించి ఆ సదరు వ్యక్తి ఓటు వేయడానికి అర్హుడా కాదా అని నాలుగో తారీఖు లోపల పరిశీలించి ఫైనల్ చేయాలి ఆ తర్వాత ఓటు హక్కు కలిగి ఉన్న వారికి సీల్డ్ కవర్ లో బ్యాలెట్ పేపర్ పంపించడం జరుగుతుంది ఆ సదరు వ్యక్తి ఓటు వేసి అదే సీల్డ్ కవర్ తో తొమ్మిదో తారీఖు లోపల ఎలక్షన్ కమిటీ కి పంపించాలి.
ఈ తీర్మానానికి ఒప్పుకున్న మా ప్యానెల్ వారు 60 ఏళ్లు పైబడిన వారిని కలుస్తూ ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని ఒక్కొక్కరికీ చెప్తూ వెళ్ళాము అయితే కొంతమందికి ఫోన్ చేసినప్పుడు విష్ణు మోహన్ బాబు ప్యానల్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి సంతకాలు తీసుకున్నారని తర్వాత మీకు బ్యాలెట్ పేపర్ పంపిస్తామని తెలియజేశారు అన్నారు.
వెంటనే ప్రకాష్ రాజ్ గారు ఎలక్షన్ కమిటీ కి ఫోన్ చేశాను సార్ ఈ రీతిగా మీరు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిస్ యూస్ చేయబడుతుందని తెలియజేసిన ప్పుడు కవర్స్ వస్తే తెలుస్తోందికవర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని తెలియజేశారు అన్నారు. ఆ తర్వాత వచ్చిన కవర్లను పరిశీలించినప్పుడు 60 కవర్లకు 50 వరకు కవర్లు ఒకేరీతిగా ఉండటం గమనించాను అని అన్నారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మూడు రాష్ట్రాల నుండి వచ్చిన కవర్లు అన్నీ కూడా ఒకే రీతిగా ఉండటం అంటే ఇవన్నీ ఒకటే చోటునుండి వచ్చాయని అని పంపింది అంతా కూడా ఒక్కరే అయి ఉంటారని కొంత అనుమానం ఉందని ఎలక్షన్ కమిటీ కి తెలియ జేశనని అన్నారు.
అదే గాక ఎవరైతే సభ్యుడో వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి మంచు విష్ణు ప్యానెల్లో డబ్బు కట్టినప్పుడు ఎలా తీసుకున్నారు సార్ అని ఆ కట్టిన వ్యక్తి యొక్క ఆధారాలు ఎలక్షన్ కమిటీ వారికి చూపించిన్నప్పుడు మరో వ్యక్తి వచ్చి ఆ కట్టిన డబ్బు వాపస్ తీసుకెళ్లినట్టు కూడా తన వద్ద రుజువులు ఉన్నాయి అని అన్నారు. ఎలక్షన్ కమిటీ వారిని ప్రశ్నిస్తూ మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఎన్నో అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటూ .. అవతల వ్యక్తులను ఎలా అనుమతిస్తున్నారు అని ప్రశ్నించాడు. చివరగా ప్రజలు ఉద్దేశిస్తూ మా ఓట్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయి అని అన్నారు