సుధీర్ ని ‘నీకెందుకు బే హౌలే’ అంటూ స్టేజి పైనే తిట్టిన ప్రియదర్శి.! VIDEO వైరల్..

News

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ .. ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా తెలిసిన పేరూ. జబర్దస్త్ షో లో మొదట్లో వేణు వండర్స్ టీంలో ఒక సైడ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుధీర్ అంచలంచలుగా టీం లీడర్ గా ఎదిగి జబర్దస్త్ అంటేనే సుడిగాలి సుధీర్ టీం అనేంతలా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే సుధీర్ ఈ జబర్దస్త్ షో తో వచ్చిన పాపులారిటీ తో అతనికి ఈటీవి ప్లస్ లో ప్రసారం ఐన పోవే పోరా ప్రోగ్రాంలో యాంకర్ గా అవకాశం వచ్చింది.

దాంతో ఆ షో లో కూడా మంచి పేరును సమ్పపాదించుకున్న సుధీర్కు ఢీ డాన్స్ షో లో మెంటర్గా అవకాశం వచ్చింది. ఇక ఆ షో లో రష్మీ కూడా ఉంతుంది కాబట్టి ఆ షో లో వారు చేసే రచ్చ మాములుగా ఉండటం లేదు. డాన్స్ షో అయినప్పటికీ రష్మీ సుధీరుల కోసం కూడా కొన్ని సన్నివేశాలను రూపొందిస్తున్నారు ఢీ షో నిర్వాహకులు.

అక్కడ కూడా మంచిగా రాణించడంతో సుధీర్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త ప్రోగ్రాంలో యాంకర్ గా కూడా అవకాహం పొందుకొని ఫుల్ బిజి గా మారిపోయాడు సుడిగాలి సుధీర్.అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటాడు సుధీర్. సుధీర్ తన సోషల్ మీడియా లో కూడా చాల ఆక్టివ్ గా ఉంటారు. ఎంతో మంది అభిమానులు కూడా సుధీర్ కి ఉన్నారు అంటే నమ్మగలరా.? ఎంత ఫేమ్ సంపాదించిన కూడా అణిగి మణిగి ఉంటాడు కాబట్టి సుధేర్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటారు.

అయితే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆ షో నిర్వాహకులు. అయితే ఈ వారం రాబోయే ఎపిసోడ్లో ప్రముఖ వెండితెర స్టార్ కమెడియన్ ప్రియదర్శి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కొసం వచ్చాడు.

 

ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ షోలో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లను ఇస్తూ అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్ లతో బాగా సందడి చేస్తుంటారు.అయితే ఈ షోలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంతున్నాడు.అయితే రీసెంట్ గా వచ్చేవారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అందులో స్నేహమేరా జీవితం అనే పేరు తో ఆ ప్రోమోను రిలీజ్ చేయగా బుల్లితెర స్టార్స్, సినీ నటులు పాల్గొని రచ్చ రచ్చ చేశారు. ఇక ప్రముఖ సిని నటుడు మరియు కమెడియన్ ప్రియదర్శి ఈ ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.అతను ఎంట్రీ తోనే బాగా రచ్చ చేశాడు. అయితే అప్పుడు సుడిగాలి సుధీర్ ‘నా చావు నేను చస్తా నీకెందుకు అని’ అని అప్పట్లో ఓ పుస్తకం రాశారు కదా అది ఏమైంది.? ఆ బూక్ని పబ్లిష్ చేస్తున్నారా.? అంటూ ప్రశ్నించడంతో, వెంటనే ప్రియదర్శి అందుకుని ‘నీకెందుకు బే హౌలే’ అనే వారు ఆ పుస్తకాన్నీపబ్లిష్ చేస్తున్నారు అంటూ సుధీర్ కి అదిరిపోయే పంచ్ డైలాగ్ తో కౌంటర్ వేసాడు. దీంతో షాక్ ఐన సుధీర్ ఆ మాట తనను అన్నాడని తెగ ఫీల్ అయిపోయాడు. అయితే ప్రియదర్శి కామెడీ టైమింగ్ కి అతని పంచ్ కి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

ఫహిమా డైలాగ్ డెలివరీకి నోరెళ్ళబెట్టిన గెటప్ శ్రీను..

కామెడీ షో అని పిలిచి అందరిని ఎడిపించేశారు కదరా

సుడిగాలి సుధీర్ ని ఆవేశం స్టార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *