priyamani-about-life

Priyamani: జీవితం చాలా చిన్నది అందుకే ఆ పని చేసేయండి.

News

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ యాక్టివ్ గా ఉంటున్నారు. కాని అప్పుడప్పుడు వారు పెట్టే పోస్టులు లేదా షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతు ఉంటాయి. ఇక తాజాగా ప్రియమణి చేసిన ఒక పోస్ట్ కూడా ఇదే రీతిగా వైరల్ అవుతోంది.

ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత తన టాలెంట్ కు పదును పెడుతూ రాజమౌళి గారు నిర్మించిన యమదొంగ సినిమాలో నటించి టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న వారికి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత నుండి ప్రియమణి గారు కూడా టాప్ హీరోయిన్లలో ఒకరిగా పరిగణించబడుతు వచ్చారు. వరుస సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన ప్రియమణి గారు ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తూ ఉండగా ఎన్నో రకాలైన వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటించారు. ప్రియమణి గారు ప్రేక్షక ప్రపంచానికి పరిచయమైన పద్దెనిమిదేళ్లు కావస్తుండగా ఆమె తన 18 ఏళ్ల లో తనలోని వివిధ ప్రతిబలను కనపరుస్తూ ప్రేక్షకులను మెప్పిస్తు ఉన్నారు.

priyamani-about-life

ప్రియమణి గారు వెండితెరపై మాత్రమే కాక బుల్లితెరపై కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే, బుల్లితెరపై కూడా తనదైన శైలిలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక తన బిజీ షెడ్యూల్ లో అప్పుడప్పుడు సమయము దొరకగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రియమణి గారు తన వ్యక్తిగత మరియు వృత్తి పరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఇక ఆ రీతిగా పంచుకున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఒక ఫోటో షూట్ లో దిగిన ఫోటోలను అభిమానుల కొరకు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రింటెడ్ గౌన్ వేసుకొని స్టైలిష్ లుక్ తో దిగిన ఫోటో లో ఆటంబాంబ్ లా కనిపించారు. ఈ ఫోటో తో పాటు ఈ విధమైన ఆసక్తికరమైన లైను జోడించారు. జీవితం చాలా చిన్నది త్వరగా గడిచి పోతుంది కాబట్టి వీలైనంత కొత్త విషయాలు చేయండి, సంతోషంగా ఉండండి , పగను విడిచి మనుషులను క్షమించేయండి, గతాన్ని మరచి నవ్వుతూ ఉండండి అంటూ స్పూర్తి నింపే రెండు లైన్లు జోడించి ఆ ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పటికీ ప్రేక్షకులు ప్రియమణిపై మంచి అభిప్రాయంలో ఉండగా దీంతో ప్రియమణి మరింత ఆదరణ సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *