కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా బాడీ బిల్డింగ్ వ్యాయామాల వల్ల తీవ్రమైన గుండెనొప్పితో ఆయన మరణించారు. ఆయన మరణం తెలుగు తమిళ కన్నడ సినీ పరిశ్రమను శోక సముద్రం లోకి నెట్టింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది.
పునీత్ రాజ్ కుమార్ గారి తండ్రి ఒకప్పటి సూపర్ హిట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు మరియు ఆయన కుటుంబం లో పునీత్ మాత్రమే కాక ఇతర సభ్యులు కూడా సినిమాలో పని చేస్తూ ఉన్నారు. వంశ పారంపర్యంగా సినీ ఇండస్ట్రీలో గొప్పవారిగా పేరు సంపాదించుకున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎన్నడూ గర్వంగా ప్రవర్తించలేదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరిని తక్కువ చేసి ఆయన చూడలేదు, ప్రజల వద్దకే తాను అన్నట్టుగా తగ్గించుకొని ఉండేవాడు అని సినీ ప్రముఖులు మరియు సాధారణ సినిమా సిబ్బంది ఆయన గురించి చెబుతూ ఉంటారు.
పునీత్ అతి తక్కువ కాలమే మనతో ఉండి చెరగని ముద్ర వేసుకొని వెళ్లి పోయాడు, ఆయన కనిపించకుండా ఎన్నో సేవలు చేసి అనాధలకు అభాగ్యులకు చిరునామా గా ఉండే వాడు. ఇప్పుడు ఆయన లేని లోటును తీర్చేందుకు ఎవరూ లేరు.
ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన ఒక మంచి స్నేహితుడు గా పేరు సంపాదించుకున్నాడు, ఆయన బాల్యంలో ఆయనతో కలిసి గడిపిన స్నేహితులను ఆయన ఈ నాటికి కూడా మర్చిపోకుండా వారిని పలకరిస్తూ ఉంటాడు, మరియు సినిమాలో నటించే నటులతో కూడా ఒక మంచి స్నేహభావం కలిగి ఉంటాడు అందుకే ఆయన అన్ని ఇండస్ట్రీలో వారికి మంచి ఆప్తమిత్రుడుగా అనిపించేవాడు , ఆయన పెళ్లి చేసుకున్న తన భార్య కూడా ఒక మిత్రుని ఇంటా విందుకు వెళ్లిన ఆయనకు పరిచయమైయ్యారు .
గొప్ప కుటుంబం అయినప్పటికీ పునీత్ నిర్ణయాన్ని కాదనక ఆయన నిర్ణయాన్ని గౌరవించి పునీత్ మరియు అశ్విని రేవంత్ కు 1999 డిసెంబర్ 1న వివాహం జరిపించారు, గడిచిన 21 ఏళ్లు తన భార్యను అల్లారుముద్దుగా చూసుకున్నాడు, జీవితం పట్ల ఎన్నో ఆశలు కలిగి తన కూతుర్ ల భవిష్యత్తు గంభీరంగా ఊహించుకున్న ఆయన వారందరినీ విడిచి వెళ్ళిపోయాడు , ఆయనకు ప్రస్తుతము ధృతి మరియు వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.