కన్నడ చిత్రసీమలో దశాబ్దాలుగా మెరుస్తున్న రాజ్ కుమార్ కుటుంబం నుండి వచ్చిన ఆల్ టైం కన్నడ ఫేవరెట్ హీరో కనడా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం తో చిత్రసీమను పవర్ స్టార్ టైటిల్ ను అభిమానులను ఒంటరిని చేశాడు, ఆయన స్థానాన్ని తీసుకునే వ్యక్తి ఇక రాడు అనే చేదు జ్ఞాపకం ప్రజల మనసులను కలచివేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ మరణం భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ లోనీ స్టార్ హీరోలను కదిలించింది. పునీత్ తో ఉన్న తమ స్నేహ బంధము జ్ఞాపకం చేసుకొని మాటిమాటికి తలపోశారు. ఇండస్ట్రీ లో అతి చిన్న వయసు వడై ఉండి అయనా మరణించగా ఎంతో మంది ప్రముఖులు సీనియర్ యాక్టర్ లు ఆయన చివరి యాత్రకు తరలివచ్చారు అంటే ఆయనకు ఇండస్ట్రీలోని వ్యక్తులతో ఎంత మంచి సంబంధం మరియు గౌరవం ఉన్నాయో తెలుస్తోంది.
అయితే టాప్ హీరోగా ఉన్న తను తన మరణం వరకు కూడా రకరకాల సినిమాలతో బిజీగా ఉన్నారు, ఆయన మరణించే సమయానికి కూడా రెండు సినిమాలకు ఒప్పుకొని సంతకం కూడా చేశారట. ఇక ఆ రెండు సినిమాలలో ఒక సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజున అంటే మార్చి 17 2022న విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న సమయంలో పునీత్ మరణం తో ఆ సినిమా పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ఆయన పుట్టినరోజున రిలీజ్ అవుతున్న చిత్రం జేమ్స్ ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో చేతన్ కుమార్ దర్శకత్వంలో నిర్మించబడింది. చేతన్ కుమార్ గతంలో పునీత్ తో కలిసి రాజకుమార సినిమాను నిర్మించారు. ఇక జేమ్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా పునీత్ మరణించడంతో చేతన్ ఈ సినిమాను విలువైనదిగా భావించి తన పూర్తి కృషితో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా చివరి దశకు చేరుకోగా పునీత్ గారి ఆడియో అవసరం ఉండగా ఆయన వాయిస్ ను తిరిగితే లేని పరిస్థితిలో ఉండి చిక్కుల్లో పడిన చిత్రబృందం. ఆయన వాయిస్ ను అలాగే దింపేసే టెక్నాలజీని వాడదామని నిర్ణయించుకొని ముంబాయికు సంబంధించిన ఒక ఐటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారట.
ఇక ఈ సినిమాలో పునీత్ ఒక బాడీ బిల్డర్ గా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమా కోసం తన ఫిజిక్ ను ఫిట్ గా వుంచుకునే ప్రయత్నంలో జిమ్ లో వ్యాయామం చేస్తూ చాలా సమయం గడిపే వాడట చివరికి ఆ కసరత్తులే ఆయన ప్రాణాన్ని బలిగొన్నాయి.
ప్రస్తుతం శోకసముద్రంలో ఉన్న కన్నడ చిత్ర అభిమానులు ఈ సినిమా ద్వారా పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారిగా తెరపై చూసుకునే సమయం కొరకు ఎదురుచూస్తున్నారట.