Puneeth Rajkumar. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన రోజున అసలు జిమ్ కు వెళ్ళలేదని ఆయన మరణానికి ముఖ్యకారణం ఎంటో తెలియజేసి సంచలన నిజాన్ని బయటపెట్టిన శ్రీకాంత్.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ గారు ఎలా చనిపోయారో మనందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి ఒక్కరూ ఆయన గుండె పోటు వల్ల చనిపోయాడని నమ్ముతున్నాము అయితే శ్రీకాంత్ గారు మాత్రం ఆయన మృతికి కారణం హార్ట్ఎటాక్ కాదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.
పునీత్ గారు తెలుగు సినిమాల్లో నటించకపోయినా ఇటు తెలుగు అటు కన్నడ సినిమాలలో నిర్మాతలకు మరియు సినీ ప్రముఖులకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన చివరి దినాల్లో నిర్మించిన యువరత్న అనే సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్నా మొదటి సినిమా. ఈ సినిమా కన్నడలో ఆయన పేరుకు పవర్ స్టార్ అనే టైటిల్ ఉండగా తెలుగులో డబ్బింగ్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారికి విలువనిచ్చి పవర్ స్టార్ అనే టైటిల్ ను ఆయన పేరు నుండి తొలగించడు. ఇలా అందరినీ గౌరవిస్తూ తన అహాన్ని చూపెట్టకుండ తగ్గించుకొని జీవించిన వ్యక్తినీ మరణం కబలించి సినీ పరిశ్రమలో తీరని లోటు ను తీసుకుని వచ్చేది.
ఇక ఆయన మరణాంతరం తెలుగు పరిశ్రమ అంతా కూడా పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించడానికి ఆయన ఇంటికి చేరారు, ఇక అలా వెళ్ళిన హీరో శ్రీకాంత్ పునీత్ తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడ్డాడు ఇదే సమయంలో ఆయన మరణం పై వస్తున్న వార్తలకి స్పందించారు.
పునీత్ ఒక స్టార్ హీరో కొడుకు అయ్యుండి పరిశ్రమలో తగ్గించుకొని ఒక స్టార్ గా కాకుండా సాధారణ వ్యక్తిగా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండేవాడు, ఆయన బయటికి చెప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, పునీత్ తన చిన్ననాటి స్నేహితులు లో ఎవరిని కూడా మర్చిపోలేదు ఇప్పటికీ పలకరిస్తూనే ఉంటాడు, ఎంతోమంది మంచి వ్యక్తులను చూశాను కానీ పునీత్ ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు.
ఇక నేను పునీత్ కలిసి ఒక సినిమాలో నటించాను సుమారు నలభై రోజులపాటు ఓకే సెట్ పై పని చేశాము, పునీత్ గారు ఆ సినిమాలో బాడీ బిల్డర్ గా నేను విలన్ గా చేశాను అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. అయితే ఆ సెట్ లో ఉన్నప్పుడు పునీత్ నన్ను శ్రీకాంత్ సార్ మీరు భోజనానికి బయటకు వెళ్ళదు ఇంట్లో నుంచి భోజనం వస్తుంది బయట చేయద్దు ఆలస్యమైనా ఇంటినుంచి రప్పిస్తా అని ఇంటి నుండి భోజనం తెప్పించి పెట్టాడు. ఇలా నాతోనే కాదు సుమారుగా అందరితో మంచి ప్రవర్తన కలిగిన వాడు పునీత్, ఇంత మంచి వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం అని ఆయన అన్నారు.
ఇక పునీత్ గుండెపోటుతో మరణించాడు అంటే నేను నమ్మను ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండే మనిషి . ఆయన మరణించే ముందు రోజు రాత్రి నుండే ఆయన అస్వస్థతకు గురయ్యాడు ఉదయాన్నే లేవగానే కొంచెం అన్ ఈజీగా ఉందంటూ డాక్టర్ని కూడా కలిశాడు. టీవీలో వస్తున్నట్లు ఆయన జిమ్ చేస్తూ కింద పడి చని పోలేదు ముందుగా ఫ్యామిలీ డాక్టర్ ని కలిసిన ఆయన వెంటనే విక్రమ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయబడ్డాడు. ఆయన చనిపోయిన రోజున అసలు జిమ్ కు వెళ్ళ లేదని క్లియర్ కట్ గా చెప్పాడు శ్రీకాంత్.
అయితే ఈ గుండెపోటు వ్యాధి అనేది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నాను శాపం. పునీత తండ్రి రాజ్ కుమార్ కూడా ఇలాగే మరణించాడు. ఆయన తమ్ముడికి గుండెపోతు వ్యాధి ఉంది వాళ్ళ కుటుంబంలో ఉన్న శివరాజ్ కుమార్ కు కూడా ఇదే గుండెపోటు జబ్బు ఉండేది ఇక చివరికి పునీత్ కూడా గుండె జబ్బు తోనే మరణించాడు అని వాస్తవాలు బయట పెట్టాడు.