purohit

కరోనాతో పురోహితుడు మృతి…కుటుంబ భారాన్ని ఎత్తుకున్న అతని 10 ఏళ్ల కూతురు

Movie News

దేశంలో కరోనా ప్రభావం కారణంగా ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయి,కుటుంబాన్ని పోషించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. దేశం లో చాలా రాష్ట్రాలలో లాక్డౌన్ ఉండడం వల్ల ఆయా వృత్తుల వారికి పని దొరకకపోవడంతో బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే చాకలి,పురోహితం,కుమ్మరి వంటి వృత్తులవారు వివాహ సమయాల్లో ఎంతో కొంత ఉపాధి పొందుకునేవారు కానీ లాక్డౌన్ కారణంగా ఎక్కడ కూడా పెళ్లిళ్లు జరగడం లేదు.

ఒకవేళ జరిగిన కూడా చాలా రహాస్యంగానే జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడం పౌరాహిత్యం చేసేవారికి తలకు మించిన భారంగా మారింది. ఏ పెళ్ళైన పురోహితుడు లేకుండా జరగదు,ఎంత టెక్నాలజీ పెరిగిన పురోహితుడి పెళ్లి మంత్రాలు లేనిది పెళ్లి జరగానే జరగదు. కానీ కరోనా కారణంగా కొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు ఇంకొంత మంది రద్దు చేసుకుంటున్నారు. ఇలా పురోహితుడి జీవనం మరీ దారుణంగా మారిపోయింది.

కరోనా ఎన్నో కుటుంబాలలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒకే కుటుంభం లో ఇద్దరు ముగ్గురు చనిపోయి కుటుంబం లో కరోనా కోలుకోలేనంత దెబ్బతీసింది.ఇంకొంత మంది పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కునే కోల్పోయి కుటుంబ సభ్యులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి.

purohit

కొంత మంది అప్పులు కూడా చేసి ప్రాణాలు నిలబెట్టుకోడానికి ప్రయత్నించిన,ప్రాణాలు దక్కక అప్పులు మాత్రం మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇంకా ఆ అప్పులు తీర్చే బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులకు తలకు మించిన భారంగా మారింది.

అయితే ఇటీవలే కరోనా తో ఒక పురోహితుడు మరణించాడు.కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలని అతని 10 ఏళ్ల పెద్ద కుమార్తె తండ్రి దగ్గర నేర్చుకున్న పౌరాహిత్యం తో ఆ కుటుంబానికి కొడుకు లేని లోటు తీర్చి వారి బాగోగులు చూసుకుంటుంది.  ఆమెకు ఒక తల్లి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే…

నిజామాబాద్ జిల్లా బోర్గం గ్రామానికి చెందిన పూజారి సంతోష్ కి ముగ్గురు ఆడపిల్లలు.సంతోష్ వృత్తిరిత్యా పురోహితుడు కాబట్టి బోర్గం గ్రామంలోని హనుమాన్ ఆలయంలోని పూజారిగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే నెల రోజుల క్రితం అతనికి కరోనా సోకి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే అతని పెద్ద కుమార్తె రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకొని తన నాన్న తనకు నేర్పించిన పౌరాహిత్యాన్ని చేస్తూ తన తల్లిని ఇద్దరు చెల్లెళ్లను పోషించుకుంటుంది. తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే తను మాత్రం ఇంటి బాధ్యతను మోస్తూ ఉండటం చూసి చుట్టుపక్కల వారు ఎంతగానో అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *