pushpa-movie-keshava-character

పుష్ప సినిమాలో కేశవ క్యారక్టర్ చేసింది ఎవరో తెలుసా?

Movie News

పుష్ప సినిమా చూసిన ఎవరికైనా వచ్చే ఒకే ఒక డౌట్ అల్లు అర్జున్ వెనకాల రష్మిక కంటే పవర్ఫుల్ పాత్రలో కనిపించిన యాక్టర్ ఎవరు. హీరో పక్కనే ఉంటూ హీరో పైనే సెటైర్లు వేస్తూ హీరో తో సమానంగా ప్రేక్షకులను ఆకట్టు కుంది ఎవరు అని అభిమానులను తికమక పడుతున్నారు.

ఒక భారీ లెవెల్ సినిమాలో అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి వ్యక్తి లీడ్ యాక్టర్ పక్కన నటించడం చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు.. భారీ స్థాయిలో నిర్మించబడ్డ పుష్ప సినిమా లో హీరో పక్కన నటించడం అంటే ఆ వ్యక్తికి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ పాత్ర వెనుక ఉన్న అసలు రహస్యం సుకుమార్ సినిమా నిర్మించే జిమ్మిక్ అని చెప్పవచ్చు. ఏదైనా ఒక గొప్ప సినిమా తెరకెక్కుతోంది అంటే లీడ్ రోల్ తోపాటు గొప్పగా చిత్రీకరించబడిన వ్యక్తి కూడా గొప్పవాడే ఉండాలి అని చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం గొప్ప వ్యక్తుల కంటే ఇండస్ట్రీలో కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తూ ఉంటాడు. గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా లో హీరో తో కలిసి ఉండే ముఖ్యమైన రోల్ నీ జబర్దస్త్ కమెడియన్ మహేష్ కు ఇచ్చాడు.

pushpa-movie-keshava-character

అదే రీతిగా పుష్ప సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన కేశవ క్యారక్టర్ అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి. ఈ పేరు వినగానే అసలు ఇంతకు ముందు ఎన్నడూ వినని పేరు అని నిర్థారణకు వస్తారు అయితే జగదీష్ ప్రతాప్ మాత్రం ఇంతకుముందే కొన్ని సినిమాల్లో కనిపించాడు.

గతంలో కరుణ కుమార్ నిర్మించిన పలాస 1978 ఈ సినిమాలో ఆయన నటించాడు . ఈ సినిమా తర్వాత జగదీష్ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం సినిమా లో కూడా నటించాడు అయితే ఆ సినిమాలో చిన్న పాత్ర లోనే ఆయన కనిపించేసరికి ప్రేక్షకుల గుర్తింపు దక్కలేదు. తర్వాత చాలా రోజులకు పుష్ప సినిమా తో గొప్ప పాత్రలో కనిపించారు.

అయితే సుకుమార్ ఈ సినిమాలో జగదీష్ ను వాడుకోవడానికి ముఖ్య కారణం ఆయన అద్భుతంగా సీమ యాసలో మాట్లా డగలగడమే . పుష్ప సినిమా సీమ ప్రాంతాలలో జరిగిన కథ లాగా ఉంటుంది గనుక సుకుమార్ సీమ యాస అనర్గళంగా మాట్లాడే జగదీష్ కు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని చెప్పుకోవచ్చు.

సుకుమార్ జగదీష్ ను నమ్మినందుకు జగదీష్ మంచి నటనను కనబరిచి సుకుమార్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమాతో జగదీష్ ఇంకా ఎన్నో అవకాశాలు పొందు కోవటం ఖాయమని ప్రముఖులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *