pushpa-movie-news

ఆ రెండు సినిమాలను టెన్షన్ పెడుతోన్న “పుష్ప”,ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయితే ఇక ఆ నిర్మాతల ఖేల్ ఖతమ్

Movie News

అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారిగా చేస్తున్న పాన్ ఇండియా సినిమా “పుష్ప. ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. తెలుగులోనే కాకుండా,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా నిర్మాతలు. అయితే పదిహేనేళ్ళ అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో “పుష్ప” సినిమాకి సంభందించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేయడమే కాకుండా, తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ పుష్ప సినిమాలో చేస్తున్నారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ కి కెరీర్ పరంగా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ఈ నెల 17 న మొదటి భాగం రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రిపేర్ అవుతున్నారు. ఆ తర్వాత రెండో భాగం వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తారని భోగట్టా. అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా మొదటి భాగం ముందు అనుకున్నట్టుగా ఈ నెల 17 న రిలీజ్ కాకపోవచ్చు అని భావిస్తున్నారట. “పుష్ప” సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, ఎటువంటి బజ్ ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ లేదని పలువురు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా షూట్ చేయాల్సిన పార్ట్ కూడా కొంత మిగిలే ఉందట. కాబట్టి ఈ డేట్ కి పుష్ప 1 సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని కొందరి ఫిల్మ్ క్రిటిక్స్ ఆఫ్ ధి రికార్డ్ గా మాట్లాడుతున్నారు.

అయితే వీరి అనుమానమే గనుక నిజం అయితే, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం వల్ల, ఆ తర్వాత వారం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రెండు సినిమాలకి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నెల 17 న “పుష్ప” సినిమా ను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఆ తర్వాత వారం అంటే డిసెంబర్ 24 న మరికొన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి ఆయా నిర్మాతలు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్న సినిమాలలో ముఖ్యమైనవి వరుణ్ తేజ్ నటించిన ‘గని”, నాని హీరోగా చేసిన “శ్యామ్ సింగ రాయ్”. పుష్ప సినిమా ఈ నెల 17 న కాకుండా, 24 న రిలీజ్ అయితే మాత్రం,ఆ డేట్ న రిలీజ్ కావల్సిన ఈ రెండు సినిమాలకి  తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఈ రెండు సినిమాల నిర్మాతలు చాలా టెన్షన్ కి గురవుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.

అసలే సంక్రాంతి సీజన్ కి తీవ్రమైన పోటీ ఉన్న నేపధ్యములో, పుష్ప సినిమా రిలీజ్ ఆలస్యం అయితే పరిస్తితి మరింత దిగజారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. సంక్రాంతి సీజన్ కి థియేటర్లు దొరక్క పోతే ఆయా సినిమాల నిర్మాతలు ఆర్థికంగా ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. అయితే సుకుమార్ తన గత సినిమా “నాన్నకి ప్రేమతో” సినిమాలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి చాలా చక్కగా వివరించాడు. అలాగే ఇప్పుడు ఏదో కారణం వల్ల పుష్ప సినిమా రిలీజ్ ఆలస్యం అయితే,ఈ సినిమాకి ఎటువంటి సంభందం లేని మిగతా సినిమాల నిర్మాతలు ఇబ్బంది పడడం పట్ల బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదేనేమో అని కొందరు సినిమా ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *