సమాజం లో జరుగుతున్న అన్యాయాలను, శ్రమ దోపిడీలను , పెత్తందారుల నిలువు దోపిడీలను తన దైనా శైలిలో తెరకెక్కింస్తూ సమాజం లో చైతన్యాన్ని తీసుకొచ్చే చిత్రాలు ఎన్నో చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తన లాంటి వ్యక్తులు ఒక పది మంది ఉన్న చాలు సామాజం బాగుపడుతుంది అనేంతలా ఇంపాక్ట్ సృష్టించుకున్న ఆర్ నారాయణ గారంటే ఈ తరం వారికి ఐడియా లేకపోవచ్చు కానీ ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆయన పేరు తెలియని వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండేవారు కాదు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఎన్ని సినిమాలు తీసిన ఎంత గుర్తింపు సంపాదించిన కూడా నారాయణ మూర్తి గారు అందరిలా కాకుండా చాల సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. అతని వస్త్రధారణలో ,అతని మాట తీరులో సమాజానికి ఒక పాఠాన్ని నేర్పించే అనేక అంశాలు మనం చూడొచ్చు. ఇటీవలే అతను నూతన వ్యవసాయ చట్టం పై పోరాడుతూ, ప్రజలలో అవగాహన కలిపిస్తూ తెరకెక్కించిన చిత్రం రైతు యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్నారు. అయితే ఈ చిత్రం లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాల వాళ్ళ కలిగే నష్టాల గురించి వివరంగా ఉంటుందని వివరించారు.
ఎప్పుడు కూడా సమాజ చింతన ఉండే ఆర్ నారాయణ మూర్తి సినీ కార్మికుల గురించి కూడా ఆలోచించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరాడు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ OTT ప్లాటుఫార్మ్స్ ని నిషేధించాలి అన్నట్లు గా మాట్లాడారు. సినిమా థియేటర్లను సాధ్యమైనంత త్వరగా తెరవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూనే ఈ కొత్తగా వచ్చిన ఓ టి టి వేదికలను ప్రస్తుతానికి నిషేధించాలని కోరుకున్నాడు.
ఎందుకంటే ఈ ప్రపంచం లో ఓ టి టి ని వినియోగించేవారు కేవలం 25 శాతం వరకే ఉన్నారు ,తనకు కూడా ఈ ఓ టి టి వినియోగించడం రాదూ అంటూ , తనలాంటి వారు ఎంతో మంది నారప్ప లాంటి మంచి సినిమాలు చూడాలని ఉన్న ఓ టి టి ని ఉపయోగించలేక చూడలేకపోతున్నారు.
సినిమా థియేటర్లు అంటే ఒక పండగ వాతావరణం ని గుర్తు చేస్తుంది. సినిమా థియేటర్లు ఆ సందడి ఈ ఓ టి టి లో లభిస్తాయా అంటూ ప్రశ్నించారు నారాయణ మూర్తి గారు. తనకు నారప్ప సినిమా చూడాలనుందంటూ ఆ సినిమా డైరెక్టర్ ని అయ్యా గారు ఓ టి టి లో ఈ చిత్రం ఎలా చూడాలో కాస్త చెప్పండి అంటూ సెటైర్ వేసాడు.