ఆర్.నారాయణ మూర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నారాయణ మూర్తి గారు. ఎంత పలుకుబడి పేరు ఉన్న కూడా ఎప్పుడూ కూడా గర్వాంగా మాట్లాడారు , ప్రవర్తించారు.సాధారణంగా జీవించే వ్యక్తిత్వం అతనిది. ఇతరులకు ఏదో ఒక ఉపకారం చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు అతని సినిమాలే మంచి ఉదాహరణలు. సాధారణమైన వ్యక్తిలాగా రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుంటాడు.
అతని అభిమానులు వారి వాహనాలలో డ్రాప్ చేస్తాం అను చెప్పిన కూడా ఒప్పుకొడు. ఈ రోజుల్లో అందరూ డబ్బులు సంపాదించాలనో లేక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనో సినిమాలు తీస్తూ ఉంటారు కానీ ఆర్ నారాయణ మూర్తి మాత్రం ప్రజాలల్లో చైతన్యం కోసం సినిమాలు చేస్తుంటాడు.
అయితే తాజాగా ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ‘రైతన్న’ అనే చిత్రం యొక్క ప్రీ రిలీస్ మీట్ ను ఎల్ వి ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ సినిమాలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మెసేజ్ ఇచ్చారు. రైతులు దేశానికి వెన్నెముకలాంటి వాడు అని చెప్తూనే ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తుంది అని నారాయణ మూర్తి ఎన్నో సార్లు మీడియా సమీక్ష లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతని ఆలోచనలను సినిమా రూపంలో ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆలోచింపజేయలనుకుంటున్నారు.
ఈ కార్యక్రమంకు గోరేటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, చాడ వెంకటరెడ్డి ఇంకొంతమంది ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమంలో గద్దర్ మాట్లాడుతూ ఈ సినిమా కార్పొరేట్ సిస్టమ్ ను , గవర్నమెంట్ ను మరియు అధికారులను ప్రశ్నించే విధంగా ఉంటుంది అని అన్నారు. అతను ఇంకా మాట్లాడుతూ “నారాయణ మూర్తికి పొగడ్తలు నచ్చవు ఆయనకు సోకులు లేవు, భార్య లేదు సొంత ఇల్లు కూడా లేదు. అతను తను నమ్మిన సిద్ధాంతం కోసమే బ్రతుకుతాడు” అని అన్నారు. “ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎవరు అడిగిన చెప్పాడు. తనకంటూ సొంత ఆస్థి లేని వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి” అని అన్నాడు.
“హైదరాబాద్ లో అతను ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఎక్కడో 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం లో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతనికి ప్రజల హితం కోసం పోరాడడం తప్ప ఇంకేం తెలీదు” అని గద్దర్ అన్నాడు. గద్దర్ చెప్పిన ఈ మాటలు విన్న ఆర్ నారాయణ మూర్తి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
ఆర్ నారాయణ మూర్తి తన బి.ఏ డిగ్రీ పూర్తి చేసిన తరువాత మద్రాసు వెళ్లి తన గురువు దాసరి నారాయణను కలుసుకున్నాడు మరియు నీడా చిత్రంలో రెండవ ప్రధాన పాత్ర పోషించాడు. మూర్తి దాసరి యొక్క సీతా రాములు, కోరికలే గుర్రలైతే, విశ్వరూపం మరియు కె. బాపయ్య యొక్క అగ్ని పూలు చిత్రాలలో నటించారు. దసరి అతనిని సంగీత మరియు ఓరే రిక్షాలతో పూర్తి స్థాయి స్టార్ గా మార్చాడు. మూర్తి 10 జూన్ 1984 న తూర్పు గోదావరి జిల్లాలోని రాంపచోదవరంలో తన ప్రొడక్షన్ హౌస్ ‘స్నేహ చిత్ర పిక్చర్స్’ కింద ఆర్థరత్రి స్వతంత్రాన్ని తన మొదటి వెంచర్‌గా నిర్వహించారు. ఈ చిత్రం టి. కృష్ణ మరణ వార్షికోత్సవం సందర్భంగా 6 నవంబర్ 1986 న విడుదలైంది.
టి.కృష్ణ ఆ చిత్రంలో నక్సలైట్ పాత్రను పోషించారు. ఇది విజయవంతమైంది మరియు మూర్తికి కమ్యూనిస్టుగా ఖ్యాతిని ఇచ్చింది. 1986 నుండి 2018 వరకు అతను స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో 29 చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. అతను 15-20 సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ ను స్థాపించాడు. అతని చాలా చిత్రాలు సిల్వర్ జూబ్లీలు (25 వారాలు) మరియు గోల్డెన్ జూబ్లీలు (50 వారాలు) సాధించాయి.