raashi-khanna

ఇబ్బందులు పడుతున్న రాశి ఖన్నా… ఎందుకో తెలుసా

Trending

ప్రస్తుత కాలం లో సౌత్ ఇండియా లోని ప్రతి బాష సినిమాల తో బిజీ గ ఉన్న ఢిల్లీ అందాల భామ రాశి ఖన్నా. ప్రస్తుతం దాదాపు 10 ల సంఖ్యలో సినిమాలు ఒప్పుకొని షూటింగ్ కి సిద్ధ పడి ఉన్నారు. అయితే ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన సినిమా ప్రారంభం నుండి ప్రస్తుతం తన సినిమా లైఫ్ ను గురించి కొన్ని ముఖ్య మైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యం గా తన ఇంటర్వ్యూ చదివిన వారికి సినిమా లైఫ్ లో ఎలాంటి ప్రయాస పడాలో అర్ధమైయెట్టు రాశి తన అనుభవం ద్వారా తెలియ జేసింది.

వివరాల్లోకి వెళ్తే రాశి కన్న ప్రస్తుత కాలం లో ర‌వితేజ‌, ఎన్టీఆర్‌, విజ‌య‌దేవ‌ర‌కొండ వంటి హీరోల‌తో కొన్ని ముఖ్య మైన సినిమాలు చేశారు. ఆ తర్వాత తమిళ్ మలయాళం ఇండస్ట్రీస్ లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి ఈ క్రమం లో రాశిని ఒక మూవీ క్రిటిక్ ఇంటర్వ్యూ చేయడం జరగింది ఆ ఇంటర్వ్యూ లో తన కెరీర్ ప్రారంభం లో ఎదురైన ఇబ్బందుల గురించి బయట పెట్టింది. ముఖ్యంగా రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డంపై త‌న అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చింది.

ముఖ్యం గా రొమాంటిక్ సినిమా ల గురించి తన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. తన అనుభవాన్ని ఇలా స్టార్ట్ చేసింది ఒక సినిమా ఒప్పుకున్నామంటే ఎలాంటి విధమైన నటనైన చేయాల్సిందే. ఒప్పుకున్న తర్వాత మార్చుకోవడం మనుకోవడమో అనే ఆప్షన్ ఉండదు కశ్చితం గా నటించాల్సిన. అంటూ తను మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన రొమాంటిక్ సీన్స్ గురించి ప్రస్తావించారు.

raashi-khanna
raashi-khanna

సినిమా ఇండస్ట్రీలో లో ఎంట్రీ అవుతున్న రోజుల్లో మద్రాస్ కేఫ్ వంటి సినిమాల్లో జాన్ అబ్రహాం సరసన భార్య క్యారెక్టర్ రావటం రాశికి మంచి స్టార్ట్ ఇచ్చింది అంటూనే ఆ సినిమాలో జాన్ అబ్రహాం తో చేసిన రొమాంటిక్ సీన్స్ తనను ఎంతో బాధ పెట్టాయి అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలోనే తను మొదటి సారిగా రొమాంటిక్ సీన్స్ చేశాను అంది. సినిమాలలో ఈ విధమైన సీన్లు ఇష్టం లేకున్నా స్క్రిప్ట్ ని బట్టి ఇష్టం లేకున్నా లేదా అలాంటి సీన్ ల కొరకు ప్రిపేర్ అవ్వకున్న చేయాల్సిందే అని అంది.

ముఖ్యం గా కెరీర్ తొలి రోజుల్లో జాన్ అబ్రహం వంటి యాక్టర్ తో నటించడం మంచి విషయం అయినప్పటికీ రొమాంటిక్ సీన్ల వల్ల ఇబ్బంది పడే దాన్ని సీన్ అయిపోయాక కారివాన్ లో కి వెళ్ళి ఏడ్చే దాన్ని కానీ బడ పడి లాభం లేదు అని రాశి ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు నటనను ఒక ప్రొఫెషన్ గానే చూడాలి పర్సనల్ గా చూడొద్దు అని అర్దం చేసుకోడానికి ఎంతో కాలం పట్టింది అని చెప్పుకొచ్చింది.

ఇక విజయ దేవరకొండ తో నటించిన వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా వ‌చ్చేప్ప‌టికీ ఇవ‌న్నీ త‌న‌కు సినిమాను ఎలా తెస్కోవలి నిజ జీవితానికి సినిమాలు ఎలాంటి వ్యత్యాసం ఉందో పూర్తిగా బోధ‌పడ్డాయ‌ని పేర్కొంది. దీంతో ఆ సినిమాలో రొమాంటిక్ సీన్లు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఏ కంగారు లేకుండా న‌టించానంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్రను విమ‌ర్శించినా ప‌ర్స‌న‌ల్‌గా తీసుకోలేద‌ని అన్నారు. ఒక్కో సినిమా చేసే కొద్దీ అనుభవం వస్తుంది ఆ అనుభవం నేర్పిన పాఠాలు సినిమా లైఫ్ లో నాకెంతో ముఖ్య మైన వని రాశి కన్న బలంగా నమ్ముతాను అని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *