ప్రభాస్ : అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన డార్లింగ్.! ‘రాధేశ్యామ్’ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేసాడు..

Movie News

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాదేశ్యామ్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీస్ అవుతుందని ప్రభాస్ అభిమానులతో పాటుగా పూర్తి ఇండియానే ఎదురుచూస్తుంది. అయితే ఈ సినిమా తన షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంది మరియు విడుదల కోసం వేచి ఉంది. ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నీటిస్తున్న విషయం తెలిసిందే.అయితే జిల్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించిన రాధాకృష్ణ ఈ మూవీ కి డైరెక్షన్ చేశాడు. అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.

అయితే ప్రపంచంలోనే అత్యంత వ్యూస్ సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా ఈ మోషన్ పోస్టర్ రికార్డ్ సొంతం చేసుకుంది.పిరియడికల్ లవ్ స్టొరీ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ముందే చెప్పారు ఈ చిత్ర నిర్మాతలు.యూరోప్ లో 1980ల రొమాంటిక్ లవ్ స్టొరీ నేపధ్యం లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. ఆ కాలంకి సంబంధించిన సెట్లు నిర్మించి యాక్షన్ సీన్స్ ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు ఈ చిత్రయూనిట్.

radheshyam

అయితే ఇంతకుముందు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే రాధేశ్యామ్ మూవీ నుండి ఎటువంటి అప్డేట్స్ మరియు విడుదలకు సంబంధించిన డేటు గురించి ఎటువంటి వార్తలు చిత్ర యూనిట్ నుండి రాకపోవడంతో చాలా రోజులుగా రెబెల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ మూవీ మేకర్స్ పై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే.

కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదలకు అంతకంతకు ఆలస్యమైంది. ఆ మధ్య 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది అనే పుకార్లు కూడా వచ్చాయి.అయితే అభిమానులు అందరికి గుడ్ న్యూస్ చెబుతూ తాజాగా ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్‌‌‌ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.2022 జనవరి 14 ను రాధేశ్యామ్ రిలీస్ డేట్ గా ప్రకటించారు ఈ చిత్ర యూనిట్.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. దానితో పాటుగా రెబెల్ స్టార్ ప్రభాస్ సూపర్ పోస్టర్‌‌‌‌ను కూడా విడుదల చేశారు. అయితే హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా విడుదల డేట్‌‌‌నూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా మూవీ రాధేశ్యామ్ కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది“ అని ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *