ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త మరియు ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ నేరారోపణతో అరెస్టవడం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లో ఛాన్సులు ఇస్తానంటూ యువతులను ట్రాప్‌లోకి దించి వారితో బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించాడంటూ అతడి మీద నేరారోపణలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మోడల్ మరియు నటి సాగరిక సోనా సుమన్ యొక్క ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో గత సంవత్సరంలో విధించిన లాక్‌డౌన్‌లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నా. గత సంవత్సరం ఉమేశ్ కామత్ అనే పేరుతో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. రాజ్ కుంద్రా నిర్మిస్తున్నఒక వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు.అసలు ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరని నేను అతన్ని అడిగితే అతడు హీరోయిన్ శిల్ప శెట్టి భర్త అని పేర్కొన్నాడు.”
నేను వారు చెప్పిన సినిమా లో నటిస్తే భవిష్యత్తులో కూడా మంచి ఛాన్సులు వచ్చి గొప్ప స్థాయికి వెళ్లొచ్చు అని ఎంతో కచ్చితంగా చెప్పడంతో నేను ఆ అవకాశాన్ని వదుకోలేక సరే అని అంగీకరించాను. అయితే అతను నాతో ముందు ఒక చిన్న ఆడిషన్ ఉంటుందని,కానీ ఇది కోవిడ్ టైం కాబట్టి వీడియో కాల్ ద్వారా మాత్రమే ఆడిషన్ జడుపుతున్నాం అని చెప్పాడు. ఇక నేను వీడియో కాల్‌లో జాయిన్ అయ్యాక అతడు నన్ను అలా ఆడిషన్‌లో పాల్గొనమన్నాడు. ఒక్కసారిగా నేను షాకయ్యను అప్పుడు నేను వెంటనే అతడికి అస్సలు కుదరదని తేల్చి చెప్పాను”.
“ఆ వీడియో కాల్ లో అక్కడా నలుగురు వ్యక్తులు కనిపించారు. అయితే అందులో ఒక్కరూ తన ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు, కానీ అతడే రాజ్‌కుంద్రా అనుకుంటున్నా. నిజంగా అతడు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడితే రాజ్‌కుంద్రాను వెంటనే అరెస్ట్ చేసి, ఈ రాకెట్ గుట్టు రట్టు చేయాలని కోరుకుంటున్నా” అని సాగరిక తెలిపారు. అయితే రాజ్‌కుంద్రా ఆఫీసు నుంచి పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేయడంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిదే ప్రధాన పాత్రా ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ నేరారోపణలో ఇప్పటికే చాల బలమైన ఆధారాలు లభించాయి మరియు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.