rajamouli-mahesh-babu

రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు తోనే. ఇది భారత్ సినీ ఇండస్ట్రీ లోనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా.

News

ఇంకా RRR రిలీజే కాలేదు అప్పుడే రాజమౌళి తర్వాత చేయబోయే సినిమాల గురించి అభిమానులు మాట్లాడుకోవడం షురూ చేశారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా క్యతిని పెంచి పూర్తి భారత దేశాన్ని సౌత్ సినిమాల వైపు చూసేలా చేశాడు. అదే రీతిగా భారత దేశానికి మొదటి ప్యాన్ ఇండియా స్టార్ ను కూడా పరిచయం చేశాడు.

రాజమౌళి ఏదైనా సినిమా అనుకున్నాడు అంటే ఆ సినిమా పైన ఎవరు కూడా మామూలు అంచనాలు పెట్టుకోరు మన తెలుగు సినీ పరిశ్రమలో అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి.

అయితే కరోనా కష్ట కాలం లో కూడా ప్రజలకు మంచి సినిమాలు అందించే పని లో పడ్డారు రాజమౌళి ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకు ఎక్కబోతున్న సినిమా RRR ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా.

ఈ సినిమా బడ్జెట్ 450 కోట్ల భారీ బడ్జెట్ ను పెట్టడానికి సిద్ధ పడ్డారు డివివి దానయ్య గారు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న RRR కూడా బాహుబలి తరహాలో తెలుగోడి ప్రతిభను ఒక రేంజ్ ఎత్తేయడం కాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ సెన్సేషన్ అలియాభట్ వల్ల కూడా ఈ సినిమా భారీ హిట్ కశ్చిటంగా వస్తుందని దేశం లోని ప్రతి ఇండస్ట్రీ వారు చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం చేసుకుంటుంది అయితే కొన్ని చిన్న చిన్న సన్ని వేషాల షూటింగ్ ఇంక మిగిలిపోయింది అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు.

rajamouli-mahesh-babu
rajamouli mahesh babu

అయితే ఇంతటి భారీ బడ్జెట్ సినిమా తీశాక రాజమౌళి తర్వాత ఏ సినిమా తీయబోతున్నారు అని ప్రజల మధ్య ఉత్కంఠ నెలకొంది కొంతకాలం కిందట రాజమౌళి మహేష్ బాబు తో కలిసి సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు ఈ విషయాన్ని రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ కూడా ధృవీకరించడం తో ప్రజలలో ఈ విషయం బలంగా నాటుకుపోయింది.

మహేష్ బాబు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఒక అడ్వెంచర్ నీ తలపించే సినిమాను చేయబోతున్నట్లు రాజమౌళి అన్నారు అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాజమౌళి తో కలిసి ఎప్పుడు సినిమా చేస్తారో అని ప్రేక్షకులు తికమక పడుతున్నారు.

ప్రస్తుతం సర్కారు వారి పాట తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ గారి తో సినిమా చేయబోతున్నారని ఆ తర్వాత రాజమౌళి తో కలిసి సినిమా చేస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది

అయితే ఇది ఇలా ఉండగా రాజమౌళి తన తర్వాత సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలిసి ఇ భారీ యాక్షన్ సినిమాను చేయబోతున్నారని ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమా మహేష్ బాబుతో కలిసి తీసే సినిమా కాదా అని కూడా కన్ఫ్యూజన్ ఉంది భారీ నిర్మాణ సంస్థతో కలిసి తీస్తున్న సినిమా భారత చిత్ర పరిశ్రమలో ఇంతవరకూ ఎవ్వరూ చేయలేనంత భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా నిర్మించబోతున్నారు అని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం చర్చలు జరిగాయని కానీ ఈ సినిమాకు సంబంధించి ఎవరు హీరోగా ఉండబోతున్నారు మల్టీస్టారర్రా లేక సింగల్ స్టార్ సినిమాన అనే విషయాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి కానీ చాలా మటుకు రాజమౌళి గారు చెప్పిన మహేష్ బాబు తో కలిసి తీయబోయే సినిమా ఇదే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *