క్షమించమని వేడుకున్నా రాజమౌళి, కారణమూ ఏంటో తెలుస్తే షాక్ అవుతారు

Movie News

తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎవరు అనగానే గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు తన కెరియర్ ప్రారంభం నుండి నేటి వరకు ఫ్లాప్ చూడని దర్శక ధీరుడు ఎదిగాడు. అలాంటి డైరెక్టర్ తో పనిచేయాలని ప్రతి నటుడు ఒక లైఫ్ టైం అచీవ్ మెంట్ పెట్టుకుంటారు. అలాంటి డైరెక్టర్ తో పని చేస్తే కెరీర్ బ్రహ్మాండంగా మలుపు తిరుగుతుందని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఎస్ ఎస్ రాజమౌళి గారు కూడా తన కెరియర్ లో ఎంతోమంది నటులను గొప్ప స్థాయికి చేర్చాడు.

తాజాగా రాజమౌళి ఖాతాలో విడుదలైన బాహుబలి సినిమా తో తెలుగోడి సత్తా ప్రపంచమంతా తెలిసేలా చేశాడు. అలాగే సినిమాలో నటించిన నటులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా తెచ్చి పెట్టాడు. బాహుబలి తో దక్షిణ భారత సినిమాలు ఒక ట్రేడ్ మార్క్ గా మారాయి. ఎన్నో దక్షిణ భారత చిత్రాలను హిందీలో డబ్ చేయగా ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారు. దీంతో అనేక మంది నటులు ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా పని చేయడానికి సిద్ధమైపోయారు.ఆ క్రెడిట్ అంతా రాజమౌళి కే చెందుతుంది అందుకే ఆయనను దర్శక ధీరుడు అంటారు.

Rajamouli

ఇక తాజాగా రాజమౌళి గారు ప్రతిష్టాత్మకంగా బాహుబలి కంటే గొప్పగా నిర్మిస్తున్న సినిమా ఆర్.ఆర్.అర్ ఈ సినిమా కొరకు రాజమౌళి గారు ఎన్నుకున్న నటులు కూడా ఇండస్ట్రీలోనే టాప్ స్థాయిలో ఉండే నటులు కాగా ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఎంతోకాలం తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ రాజమౌళి తో కలిసి పనిచేస్తున్న ఈ సినిమా నిర్మాణం భారీ అంచనాలతో ముందుకు సాగుతుంది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా తారక్ కొమరం భీంలా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కొరకు ఇప్పటికే సినిమా పోస్టర్లు టీచర్లు మరియు పాటలు విడుదల అయ్యాయి..

తాజాగా చిత్ర బృందం దేశంలోని పలు భాషలలో విడుదల చేసిన నాటు నాటు పాట దేశమంతట మారుమోగుతోంది, ఎంతోమంది అభిమానులు ఈ వీడియో సాంగ్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేసిన స్టెప్పులకు సోషల్ మీడియాలో షాట్స్ లేదా రీల్స్ లో స్టెప్పులు కలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇక నాటు నాటు పాట వేడి తగ్గక ముందే చిత్ర బృందం జననీ పాటను కూడా విడుదల చేశారు ఇక ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. జననీ పాటను తమిళ వర్షన్ ఉయిరే ను లాంచ్ చేయటానికి రాజమౌళి చెన్నై వెళ్లగా. ఆ సమయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీడియాకు క్షమాపణలు చెప్పాడు.

తమిళ వర్షన్ కోసం తమిళనాట ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా రాజమౌళి వద్ద నుండి భారీ రుసుము చెల్లించి ఆర్ ఆర్ ఆర్ యొక్క తమిళ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇల తమిళనాడు తో మంచి సంబంధాలు ఉన్న రాజమౌళి మీడియాతో మూడు సంవత్సరాల పాటు సంబంధం లేనట్టుగా మౌనంగా ఉండి మాట్లాడలేకపోయాను అని మీడియా మిత్రులు నన్ను క్షమించాలి అని కోరాడు.

ఇక త్వరలో నిర్వహించబోయే సినిమా గ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో ఖచ్చితంగా మీడియా వారితో మాట్లాడతానని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా వచ్చే జనవరి 7 తారీఖున ప్రపంచమంతట ఘనమైన విడుదలకు సిద్దంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *