Puspha: అందరి ముందు అల్లుఅర్జున్ కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి

Movie News
  • Ui ui

తాజాగా జరిగిన పుష్పా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రాజమౌళి అందరి ముందు అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చాడు.  డిసెంబర్ 17 న  ఫ్యాన్ ఇండియా సినిమా గా విడుదల కాబోతున్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్  ఈవెంట్ ఈ నెల 12న యూసఫ్ గూడ లో  ఎంతో మంది సినీ ప్రముఖులు మరియు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంది.  

ఈ వేడుకకు హాజరైన రాజమౌళి మాట్లాడుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. 

చిత్ర దర్శకుడు సుకుమార్ కు నాకు మంచి స్నేహం ఉందనీ అయితే ఆయన ఈ వేడుకకు రానందుకు చాలా బాధగా ఉంది అన్నారు . బొంబాయి వెళ్ళిన ప్రతిసారీ పుష్ప సినిమా గురించి అక్కడివారు అడుగుతున్నారని సుకుమార్ నేను ఎన్నోసార్లు చర్చించుకున్నాము   అన్నారు. అక్కడివారు ఈ సినిమా గురించి ఎంతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. 

 ఇదే సమయంలో అల్లు అర్జున్ బ్యాచ్ కు కొన్ని వార్నింగ్లు మరియు సూచనలు రాజమౌళి ఇచ్చాడు. ఒక మంచి సినిమా తీశాము ఇక భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నాము అని ధీమాగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అన్నారు. మీరు ఇలాగే ఉంటే ఒక పెద్ద ప్రాజెక్టును చేజేతులా వదిలేసినట్టు అవుతుంది అని ఆయన అన్నారు.  సినిమా ఎంత గొప్పగా తీసిన సరైన ప్రమోషన్ లేకపోతే అసలుకే మోసం వస్తుందని తెలుసుకోవాలని అన్నారు.

బన్నీ అంటే దేశమంతా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుందని ధీమా గా ఉంటున్నారు, సినిమా ప్రమోషన్ గురించి అసలు పట్టించుకోవట్లేదు అని అన్నారు . 

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సినిమా తెలుగు పరిశ్రమలో ప్రమోషన్ చేయకున్నా మంచి హిట్ సాధిస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో లాగానే మలయాళ ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ అంటే మంచి ఫ్యాన్ బేస్ అక్కడ కూడా ఈ సినిమా గురించి ప్రచారం చేయనవసరం లేదు. 

అయితే తమిళ హిందీ పరిశ్రమలో ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్ చేయడం చాలా అవసరం అని ఆయన అన్నారు. ఎంత గొప్ప సినిమా తీసిన ఈ రెండు పరిశ్రమల్లో భారీ ప్రమోషన్ లేనట్లయితే సినిమా అనుకున్నని రోజులు ఆడదు అక్కడ లోకల్ గా ఇండస్ట్రీ లో ఒకటి వెంట ఒకటి సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి సినిమా ప్రమోషన్ ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని ఆయన అన్నారు. సినిమా ప్రమోషన్ ను చాలా ముఖ్యమైనదిగా భావించి ఎంత దూరం వెళగలిగితే అంత దూరం వెళ్ళండి అలా చేస్తే సినిమాతో పాటు ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేసిన వారవుతారు అని ఆయన అన్నారు.

 

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కనుపరిచిన డెడికేషన్ అద్భుతంగా ఉందని ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని అన్నారు రాజమౌళి. ఈ సినిమా ఈనెల 17వ తారీఖున రిలీజ్ కానున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మీ చేతిలో ఉంది తమిళ తెలుగు మలయాళ హిందీ కన్నడ పరిశ్రమల్లో ఒకేరోజు ఈ చిత్రం విడుదల కాబోతుంది.  మీరు ఎంత ప్రమోషన్ చేయాలనుకున్నా ఈ నాలుగు రోజుల్లో మాత్రమే చెయ్యాలి అందుకొరకు ఈ సినిమా నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున పబ్లిసిటీ కొరకు ప్లాన్ చేసుకోవాలి అని ఆయన అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *