rajamouli

అందుకోసం తండ్రిని బాగా టార్చర్ చేసిన రాజమౌళి, మనసులో మాటని మీడియాతో పంచుకున్న జక్కన్న

Movie News

తాను తన కెరీర్ లో దాదాపు పన్నెండు సినిమాలు తీసినా, కానీ ప్రతీ సినిమాను తన మొదటి సినిమాగానే భావిస్తాను అన్నీ అన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నారు రాజమౌళి. పాన్ ఇండియా సినిమా కావడంతో “ఆర్‌ఆర్‌ఆర్” కోసం దేశవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాల్లో ఈ సినిమా యూనిట్ సందడి చేస్తూ, వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తోంది.

“ఆర్‌ఆర్‌ఆర్” సినిమా కోసం చేస్తోన్న ప్రమోషన్స్ లో రాజమౌళి, విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు. అందులో భాగంగా, తాను సక్సెస్ ను తలకి ఎక్కించుకొను అని అంటూనే, తన ప్రతీ సినిమా కూడా మొదటి సినిమాగానే భావిస్తాను అని తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు.

అయితే ఈ సినిమాలో కొన్ని చారిత్రక ఘట్టాలు ఉన్నందున, పర్ఫెక్షన్ కోసం కథ విషయములో ఎక్కడ రాజీ పడలేదని, అందుకోసం ఈ సినిమా కథ రచయిత అయిన తన తండ్రి విజయేంద్రప్రసాద్ ను ఎంతగానో టార్చర్ చేశానని చెప్పుకొచ్చారు రాజమౌళి. అయితే మామూలుగానే రాజమౌళి ఎటువంటి విషయములో కూడా కాంప్రమైజ్ కాదు. రాజమౌళి తో సినిమా అంటే ఒకరకంగా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కీ నరకమే. కానీ రాజమౌళికి తన కెరీర్ లో సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నందున, అతనితో చేసిన టెక్నీషియన్స్ గానీ, ఆర్టిస్టులు గానీ రాజమౌళి ఎంత టార్చర్ చేసినా భరిస్తూ ఉంటారు.

rajamouli

వారు అలా సహనంతో భరించినందుకు గానూ, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి,  వచ్చిన సక్సెస్ తో ఇదంతా వారు మర్చిపోతు ఉంటారు. సక్సెస్ తర్వాత వారి కెరీర్ ఎంతో బాగుంటుంది కూడా. అందుకే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రభాస్ ఎటువంటి సినిమా చేయకుండానే, బాహుబలి సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ కష్టమే ఇప్పుడు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పాన్ ఇండియా స్టార్.

అంతేకాకుండా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకి రాజమౌళి సవివరంగా సమాధానాలు చెప్పారు. తన కథ కోసం మంచి నటులను సెలెక్ట్ చేసుకుంటానని, తన విజయనికి ఇదే ప్రధాన కారణం అని రాజమౌళి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతీ సీన్ ఎంతో పవర్ ఫుల్ గా తీయడం కోసం కష్టం,ఖర్చు కోసం ఆలోచించనని అన్నారు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లోని ధైర్యాన్ని, స్ఫూర్తిని మాత్రమే ఈ కథలో తీసుకున్నాం అనీ, వారి కథతో ఎటువంటి పోలిక లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.