జబర్దాస్త్ అనేది భారతీయ కామెడీ టెలివిజన్ షో, ఈ షో ను మల్లెమాలా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది మరియు భారతదేశంలోని తెలంగాణలోని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకబడుతుంది. దీనికి మొదట్లో సంజీవ్ కె కుమార్ దర్శకత్వం వహించారు మరియు తరువాత నితిన్ మరియు భారత్ దర్శకత్వం వహించారు. 7 ఫిబ్రవరి 2013 న ETV లో ప్రారంభమైన ఈ ప్రదర్శన 400 ఎపిసోడ్లకు పైగా నడిచింది.
ఈ ప్రదర్శనను అనసూయ భరద్వాజ్ నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో నటుడు నాగేంద్ర బాబు, నటి రోజా జడ్జెస్ గా ఉన్నారు, తర్వాత బాబు, 2019 లో గాయకుడు మనో స్థానంలో షో నుండి నిష్క్రమించారు. ఈ ప్రదర్శనలో జానీ, శేఖర్ కూడా అతిథి న్యాయమూర్తులుగా కనిపించారు. ఈ ప్రదర్శన తెలుగు ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందింది, అయితే ఈ షో అశ్లీలమైన మరియు సమస్యాత్మకమైన కంటెంట్ కోసం కూడా విమర్శించబడుతూ వస్తుంది. ఈ షో యొక్క ఎక్స్ట్రా వర్షన్ అయిన ఎక్స్‌ట్రా జబర్దాస్త్ 2014 లో ప్రసారం ప్రారంభమైంది.
అయితే ఈ షో లో ఎంతో మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అందులో కొంత మంది బాగా నటించి సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇప్పుడు వారు సినిమాల్లో కూడా బాగా రాణిస్తున్నారు. కానీ కొంత మంది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు ఎటువంటి అవకాశాలు లేక జబర్దస్త్ లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కడే హైపర్ ఆది టీం లో సహా – నాయకుడు గా చేస్తున్నా రైజింగ్ రాజు.
అతను సరిగ్గా 42 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తన సినిమా కెరీర్ ను ప్రారంభించారో సరిగ్గా అప్పుడే రైజింగ్ రాజు కెరీర్ కూడా మొదలు పెట్టారు. మొదట్లో సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ బాయ్ గా చేరిన రాజు 1981 లో మరో మలుపు అనే సినిమా తో అరంగేట్రం చేశారు. తర్వాత చిన్నా చితకా సినిమాల్లో నటించారు కానీ పెద్దగా గుర్తింపు రాకపోవడం తో మెల్లగా సినిమా అవకాశాలు కూడా దూరం అయ్యాయి. తర్వాత ఎన్నో కష్టాలను ఎదురుకున్నాను అని రాజు గారు అన్నారు. జబర్దస్త్ దయవళ్లా తాను మంచి రోజులు మళ్లీ చూస్తున్నాను అని చెప్పారు.
జబర్దస్త్ ఏంతో మందికి మంచి జీవితాన్ని ఇవ్వడం మాత్రమే కాదు కొంత మంది ఆర్టిస్టులకు కొన్ని చేదు అనుభవాలు కూడా మిగిల్చింది.గతం లో కార్మికవర్గ మహిళల జీవనశైలిని స్కిట్‌లో అవమానించారనే ఆరోపణలతో వేణు వండర్స్ టీమ్ లీడర్ వేణుపై పోలీసు కేసు నమోదైంది. వివాదం జరుగుతుండగా ఆయనపై కూడా శారీరకంగా దాడి చేశారు. ఈ దాడిని విమర్శించిన కొంతమంది ప్రముఖులు మరియు సామాన్యుల నుండి వేణుకు సోషల్ మీడియాలో మద్దతు లభించింది. ఈ సమస్య సమయంలో వేణుపై దాడి చేసినట్లు భావిస్తున్న కొంతమందిపై కూడా కేసు నమోదైంది.
ప్రసారమైన జబర్దాస్త్ ఎపిసోడ్‌లో బ్రాహ్మణ పాత్రలు మద్యం సేవించే దృశ్యాలు ఉన్నాయి. తిమ్మప్పూర్‌కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి కోర్టులో కేసు నమోదు చేసి, కామెడీకి పాల్పడిన నటులు, న్యాయమూర్తులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించారు.