రకుల్ అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం జైలుపాలే, ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్

News

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన 31 పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంది. ఆ పుట్టిన రోజు నాడే తన మేరేజ్ గురించి కూడా ఒక అప్ డేట్ ఇచ్చింది. తాను బాలీవుడ్ నిర్మాత,నటుడు అయిన జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, త్వరలోనే తమ మేరేజ్ జరగబోతోందని క్రిస్టల్ క్లియర్ గానే చెప్పేసింది ఈ బ్యూటీ. దాంతో ఈ వార్త విన్నవారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.

ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. అందువల్లే జాకీ భగ్నానీతో సాన్నిహిత్యం మరింత పెరిగిందని తెలుస్తోంది. అయితే వీలు అయినంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని, పెళ్లి పీటలు ఎక్కాలని ఈ అమ్మడు తలపోస్తున్ననేపధ్యములో, తెలుగునాట ప్రసిద్దుడు అయిన ఒక జ్యోతిష్యుడు, రకుల్ పెళ్లి ఎంతో కాలం నిలవదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇలా కామెంట్స్ చేసింది ఎవరో అయితే అస్సలు పట్టించుకొనవసరం లేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ పై ఎప్పుడూ ఎవరో , ఏదో ఒకటి కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈ కామెంట్స్ చేసింది సుప్రసిద్దుడు అయిన వేణు స్వామి. ఇంతకీ ఈ వేణు స్వామి అంటే చాలా మందికి తెలిసిన విషయమే అయినా, ఈ జ్యోతిష్యుడు సరిగ్గా నాలుగేళ్ల క్రిందటి నాగచైతన్య,సమంతా ల పెళ్లి ఎక్కువ కాలం నిలవదని కామెంట్స్ చేశాడు. అయితే అప్పుడు ఎవ్వరూ ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల చైతన్య,సమంతాలు విడిపోయిన నేపధ్యములో, వేణు స్వామి మళ్ళీ తెర మీదకి వచ్చాడు. సరిగ్గా నాలుగేళ్ల క్రిందటి తాను చెప్పిన మాటల్ని గుర్తు చేయడంతో నిజమే కదా అని అందరూ షాక్ అయ్యారు. దాంతో వేణు స్వామి జ్యోతిష్యానికి ప్రాముఖ్యత మరింత పెరిగిపోయింది.

ఈ నేపధ్యములో రకుల్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టాలు పాలవుతుందని వేణు స్వామి రీసెంట్ గా జోష్యం చెప్పాడు. అంతేకాకుండా రకుల్ మనశ్శాంతి కోల్పోయి, ఆర్థికంగానూ చితికి పోతుందని చెప్పాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రకుల్ ప్రీత్ సింగ్ ఈ వివాహం తర్వాత జైలు పాలు అవుతుందట. ఈ విషయం విన్న ప్రేక్షకులు,అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అవుతున్నారు. ఇప్పటికే రకుల్ డ్రగ్స్ విషయమై కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపద్యములో జాకీ భగ్నానీతో పెళ్లి చేసుకుంటుందా, లేదా తన నిర్ణయాన్ని పునర్ ఆలోచన చేస్తుందా అని ఆమె అభిమానులు కాస్తంత ఆందోళనగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *