మెగా స్టార్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ మార్క్ లాంటివాడు ఆయన ప్రస్తుత కాలంలో సినిమాలో నటించకపోయినా ఆయన అభిమానులు ఆయనంటే అప్పుడు ఇప్పుడు ఒకే ఆదరణ కలిగి ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి అనే చెట్టు నుండి పుట్టుకొచ్చిన వారిని మనం మెగా ఫ్యామిలీ అని పిలుస్తాం వీరిలో చాలామందీని మనం సినిమా తెరపైన చూసి అభిమానులం అయ్యాము కూడా
అయితే ఈ మెగా ఫ్యామిలీ లో సినిమా తెర ద్వారా మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుని లెక్కించలేని అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు అయితే ఈ అభిమానం తమ ఇష్టమైన యాక్టర్ ను గురించి తెలుసుకోవాలి అని ఆశ కలిగేలా చేసింది.
ఇలాంటిదే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత సంపాదించాడో ఆయన ప్రస్తుతం ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కలగడం. అయితే మెగాస్టార్ కంటే ఎక్కువగా తాజాగా ప్రొడ్యూసర్ గా మారిన మెగాస్టార్ తనయుడు అపోలో అధినేత మనుమరాలు ఉపాసన భర్త రామ్ చరణ్ ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే ఆతురత ప్రజల్లో కలిగింది.

రామ్ చరణ్ హీరోగా పరిచయమైన రెండవ సినిమా మగధీరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అప్పటివరకు కూడా ఏ సినిమా సాధించని గొప్ప విజయతో ముందుకు దూసుకొచ్చాడు అయితే ఆ తర్వాత ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ముందు అంతే సక్సెస్ ను ప్రదర్శించ లేకపోయాయి.
అప్పటినుండి కథను ఎన్నుకోవడంలో ఎన్నో జాగ్రత్తలు పడ్డాడు ఆ రకంగా ధ్రువ, రంగస్థలం, ఎవడు వంటి సినిమాలు ఆయనకు సక్సెస్ ని ఇచ్చాయి.
ఆ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ గారు మంచి కథను అందుకొని కొన్ని మంచి సినిమాలకు ఒప్పుకొని సైన్ చేసి షూటింగ్ కి సిద్ధంగా ఉన్నారు వీటిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గారు నిర్మిస్తున్న RRR , కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఆచార్య అలాగే RC15 అనే సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ మూడు సినిమాల తర్వాత మరో మూడు పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా సర్వ సిద్ధంగా ఉన్నారు ఇలా ఒకటి వెంట ఒకటి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్న రామ్ చరణ్ గారి ఆస్తి వివరాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలలో నెలకొన్నది.
రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో ఒక మంచి కొడుకు గానే కాక ఒక మంచి భర్త కూడా తన గురించి ప్రేక్షకుల నుండి మంచి అభిప్రాయాన్ని పొందుతున్నారు. ఆయన తండ్రి మెగాస్టార్ ఒక సక్సెస్ ఫుల్ హీరో మరియు ఇండస్ట్రీలో పవర్ఫుల్ పర్సన్ అలాంటి పవర్ఫుల్ పర్సన్ కి ఒకే ఒక్క కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ కి పేరు మర్యాదలు ఆస్తిపాస్తులు కూడా ఘనంగానే ఉన్నాయి మరియు తన భార్య ఉపాసన కూడా భారత దేశము అంతా కూడా గుర్తించదగ్గ సంస్థ అయినా అపోలో హాస్పిటల్స్ యొక్క అధినేత మనవరాలు కావడం వల్ల రామ్ చరణ్ ఆస్తుల పైన భారీ అభిప్రాయంతో అభిమానులు ఉన్నారు.
అయితే తాజాగా రామ్ చరణ్ ఆస్తుల గురించి వెలువడ్డ లెక్క ఎంత అంటే సుమారుగా 1500 కోట్ల పైమాటే ఇది ఒక మీడియా సంస్థ వేసిన లెక్కల్లో మార్చి 2021 నాటికి ఆయన ఆస్తి వివరాలు ఇక ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఎదుగుతున్న వ్యక్తి గనుక ఆయన ఆస్తి పదుల రేట్లలో పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు.