ఇండస్ట్రీలో గొప్ప కుటుంబం గా పిలువబడుతున్న మెగా ఫ్యామిలీ లో చాలా మందికి ప్రజా సేవ చేయాలని ఆశ బలంగా ఉంటుంది, ఎవరికి వీలైన కొలది వారు తమ స్తోమతను బట్టి సహాయపడుతూ నే ఉన్నారు. రామ్ చరణ్ చిరంజీవి వారసునిగా ఆయన నటనను మాత్రమే గాక సేవా గుణాన్ని కూడా పొందుకున్నాడు, తండ్రికి సాటియైన కుమారుడిగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చాడు.
తాజాగా హైదరాబాదులోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి ట్రస్ట్ యొక్క వెబ్ సైట్ ను ఘనంగా ప్రారంభించాడు , ఆ తర్వాత ఈవెంట్లో మాట్లాడుతూ వెబ్సైట్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరించాడు, వెబ్ సైట్ ముఖ్యంగా ప్రజలను మరింత సులభంగా చేరుకోవాలని , అలాగే ట్రస్ట్ లో కలిగి ఉన్న సదుపాయాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని ఉద్దేశ్యముతో నిర్మించామని చెప్పాడు.
అలాగే ప్రజలలో మెలుగుతూ ప్రజల వాడిగా సమస్యలు అర్థం చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలలో మరికొన్ని నూతనమైన కార్యాలు చేయడానికి అలాగే ట్రస్ట్ విస్తీర్ణ కొరకు ప్రణాళికలు జరుగుతున్నాయి అని తెలియజేశారు.
అయితే రామ్ చరణ్ కు మరొక పని ఉండడం మూలంగా ఈవెంట్ పూర్తవగానే ఈవెంట్ ఆర్గనైజర్లు వీలైనంత త్వరగా ముగించాలని ప్రయత్నిస్తూ ప్రశ్నోత్తరాలను ముగించాలని మీడియా వారిని అభ్యర్థించారు, అలాగే ఫోటోలు తీస్తామని ఆయనను వేధించ వద్దు అని వేడుకున్నారు.
కానీ రాంచరణ్ అక్కడున్న వారిని అందరిని ఆశ్చర్యపరిచి మీడియా వారి ముందు కుర్చీ వేసుకుని కూర్చుని మైక్ తీసుకుని మీడియా వారితో మాట్లాడటం ప్రారంభించారు, ముందుగా అక్కడికి చేరుకున్న మీడియా సిబ్బంది వారి పేర్లతో వారిని గుర్తించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, తర్వాత మీడియా గురించి మాట్లాడుతూ మీడియా వారు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆ తర్వాత ఎన్నో ప్రశ్నోత్తరాల కు సమాధానం ఇచ్చాడు, ముఖ్యంగా తన తండ్రి పట్ల వస్తున్న ఆరోపణల గురించి కూడా స్పందించారు, కరోనా సమయంలో ఆయన ఎవరికీ సహాయము చేయలేదని ప్రజలు విస్తృతంగా ప్రచారం చేశారన్నారు కానీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ ఓపెన్గా కనిపించకుండా గోప్యంగా ఎన్నో సేవలు జరిగాయి, ఇకమీదట వెబ్సైట్ ద్వారా ట్రస్ట్ జరిగించే పనులు ప్రేక్షకులు చూసి తెలుసుకొని ఇకపైన చిరంజీవి గారిని నిందించారు అని ఆశిస్తునన్నారు.
అలాగే ఫోటోలకు పోస్ ఇవ్వమని కోరగా మీరందరూ నా సహోదరులు ఇలా మిమ్మల్ని కలుసుకునే అవకాశం అరుదుగా వస్తుంది అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇక ఆయన ఇచ్చిన చనువుతో మీడియా వాళ్లు దూసుకెళుతూ ఫోటోలు తీశారు. అలాగే రామ్ చరణ్ మీడియా వారితో ఒక సినిమా చెయ్యాలి అనుకుంటున్నాను అని కూడా అన్నారు.
చివరగా కొరోణ సమయములో చిరంజీవి ట్రస్ట్ కు సహకరించి కిరాణా సరుకులు మరియు ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో మీడియా వారు పెద్ద పాత్ర వహించారని అని తెలియజేశారు.
ఇక తన ప్రవర్తనతో మీడియా వారిని ఆకట్టుకున్న రామ్ చరణ్ గురించి ఇలా అభిప్రాయ పడ్డారు చిరంజీవి పోలికలు మాత్రమే కాదు చిరంజీవి మనసు కూడా రామ్ చరణ్ లో చూస్తున్నాం అన్నారు.