టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్లలో ఒకరు పూరి జగన్నాథ్,. గొప్ప గొప్ప హీరోలకు మంచి సక్సెస్ ఫుల్ స్టోరీలు అందించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఆయన కుమారుడినే సినిమాల్లోకి దింపుతున్నారు. ఆయన కుమారుడు ఆకాష్ తన మొదటి సినిమా గా రొమాంటిక్ తో తెరంగేట్రం చేయబోతున్నాడు.
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా మరియు కెతిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్, ఈ సినిమా పూరీ జగన్నాథ్ మెచ్చే లవ్ మరియు మాస్ కాంబో గా తెరకెక్కబోతుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంతవరకు రిలీజ్ కాలేదు అయితే ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేయడానికి చిత్రబృందం సర్వం సిద్ధం చేసుకుంది అని తెలుస్తుంది.
ఇక సినిమా రిలీజ్ కానుండడంతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ప్రభాస్ ద్వారా విడుదల చేయించారు. ఇక ఆ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ఇంతా అంతా కాదు, ఇంటర్నెట్లో ఒక సెన్సేషన్ గా చక్కర్లు కొట్టేస్తోంది. అలాగే ఈ సినిమా తొలుత అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ , ఇప్పుడు నిర్ణయం మార్చుకొని సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాకు ఒక యంగ్ డైరెక్టర్ ని పూరి జగన్నాథ్ గారు నియమించినట్లు తెలుస్తుంది మాఫియా స్టోరీ లైన్ లో లవ్ స్టోరీ ని కలిపి తీసిన ఈ సినిమాలో ఆకాష్ కేతిక తో పాటు మరొక ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారు ఆకాష్ కి అత్తగా కనిపించబోతున్నారట, ఇక రమ్య కృష్ణ సినిమాలో కనిపించేసరికి సినిమా రేంజ్ పెరిగిపోయిందని నిర్మాత ఛార్మి తెలియజేశారు.
అలాగే చార్మి రమ్య కృష్ణ గారు షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా సినిమా పై అంచనాలు అమాంతం పెంచేసింది, ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.