యాంకర్ రష్మీ మంచితనం కు ఫిదా అయిపోయిన దీపికా పిల్లి..! అసలు ఏం జరిగిందంటే…

Movie News

యాంకర్ గా మారిన నటి రష్మీ గౌతమ్ మూగ జంతువులపై, ముఖ్యంగా వీధి కుక్కల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉంటుంది. గతంలో జబర్దాస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఈ లాక్డౌన్ కాలంలో వీధుల్లో కుక్కలకు కొంత ఆహారాన్ని అందిస్తున్నట్లు వీడియో లో కనిపించారు. రోడ్లపై ఈ జంతువుల ఆకలి బాధలను తీర్చడానికి ఎవరూ లేరని ఆమె గ్రహించడంతో యాంకర్ ఆ వీధి కుక్కలకు ఆహారం ఇచ్చారూ.

మహిళా ప్రముఖులలో జంతు ప్రేమికులు అతి తక్కువ మంది ఉన్నారు వారిలో రష్మి గౌతమ్ ఒకరు. వీధి కుక్కలు మరియు పెంపుడు జంతువుల పట్ల ప్రేమను చూపించడానికి కేవలం కొద్దిమంది నటీమణులు మాత్రమే ఉన్నారు. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన లాక్డౌన్ వ్యవధిలో 21 రోజులలో రష్మి గౌతమ్ తన కార్యకలాపాలను పంచుకుంటున్న వీడియోలను తన సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసారు.

21 రోజుల లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, రష్మి గౌతమ్ వీధుల్లో కుక్కలకు ఆహారం ఇవ్వడం గురించి మాట్లాడటం ఆపలేదు. ఇటీవల ఆమె వీధి కుక్కలకు ఆహారాన్ని అందించే వీడియోను పోస్ట్ చేసింది. ఈ కరోనావైరస్ కాలంలో రష్మి గౌతమ్ తన ఇంటి వెలుపలకు వచ్చి కుక్కలకు ఆహారం ఇస్తోంది.

ఇదిలా ఉండగా రష్మీ మూగ జీవుల పట్ల ఎలా వ్యవహరిస్తారో తాజాగా తమిళనాడు లో ఒక కుక్కను అతి కిరాతకంగా చంపిన సంఘటనే మంచి ఉదాహరణ. ఆమె ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు ఆ వీడియో చూసాక ఆమె నిందితులకు కఠినమైన శిక్షలు పడేవరకు పోరాటం చేద్దాం అని ఆమె ఏడుస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఢీ షో లో రష్మీ గౌతమ్ తో కో యాంకర్ గా పనిచేస్తున్న దీపికా పిల్లి రష్మీ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు కనిపించిన సీన్ చూసి దీపికా ఎంతగానో చలించిపోయింది అంట. రష్మీ అనారోగ్యంతో తో బాధ పడుతున్న ఒక వీధి కుక్కను తన ఇంట్లో జాగ్రత్తగా చేసుకుంటున్నారని దీపికా చెప్పింది. ఆ దృశ్యం తనని ఎంతగానో కదిలించింది అని దీపికా అన్నారు. రష్మీ అక్క కు వాలంటీర్ గా ఉండాలి అనుకుంటున్నాను. ఈ మూగ జీవులకు సహాయం చేయడానికి నేను కూడా ముందుకు వస్తాను అని దీపికా అన్నారు.

దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.ఆమె కు తర్వాత ఢీ షో లో యాంకర్ గా అవకాశం కూడా లభించింది కానీ బుల్లితెరపై ఇంకా తగిన గుర్తింపు దీపికాకు రాలేదు. అయితే దీపికా బిగ్ బాస్ సీజన్ 5 లో కాంటెస్టెంట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు చాలానే వచ్చాయి. ఈ షో తర్వాత ఆయన ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *