తెలుగు బుల్లి తెర టాప్ యాంకర్ లలో ఒక్కరూ రష్మీ. మిగితా యాంకర్ల లాగా తన కంటు ఒక స్పెషల్ స్తానని ప్రేక్షకుల మనసులో సంపాదించుకుంది. ఆమె ఆ రీతిగా ప్రజాదరణ పొందటానికి ఒకటి జబర్దస్త్ కారణం అయితే రెండవది ముగా జీవాల గురించి తను చేసే సేవ కార్యక్రమాలు.
కొంత కాలంగా ముగా జీవాలు పట్ల సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు పెడుతూ ఎంతో మందిని మూగజీవాల గురించి ఆలోచించే రీతిగా స్ఫూర్తినిచ్చింది. మూగజీవాల విషయంలో సినీ ఇండస్ట్రీలో తనకంటే పెద్దవారికి సాహితం సూచనలు ఇచ్చింది.
వీధుల్లో ఎవరు లేని అనాధలుగా ఒంటరి గా ఉంటు ఎవరో ఒక్కరూ పెడితే లేదా ఎవరో పరవేసే చెత్త కొరకు ఏదురు చూసే దయనీయ పరిస్థితి ముగ జీవాలది. కరోనా కష్ట కాలం లో అయితే వాటి గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. లాక్ డౌన్ వల్ల ఎవరు కూడా బైటికి వచ్చి వాటి గోడు పట్టించుకోలేదు అలాంటి పరిస్థితి ఒక మనిషికి వస్తె ఆ పరిస్థితి కంటే దరునమైనది మరొకటి ఉండదు అని గతం లో సోషల్ మీడియా ద్వారా స్పందించిన రష్మీ అదే సమయం లో ఒక వీది కుక్క యాక్సిడెంట్ విగతజీవిగా రోడ్డు పక్కన పడి ఉండడం చూసి తన ఇంట చేర్చుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇదే మాదిరిని మీరు కూడా ఫాలో అవ్వాలి అంటూ సినీ పరిశ్రమలో ప్రముఖులకు సెటైర్లు వేస్తూ చెప్పింది. ఇంతటి ఆప్యాయత మూగజీవాల పట్ల ఉన్న రష్మిని తాజాగా ఒక వ్యక్తి రాష్మీని ఒక వీడియో లో ట్యాగ్ చేశాడు.
ఆ వీడియోలో మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఒక కుక్కను మూతి కట్టేసి విచక్షణారహితంగా కొడుతూ ఆ కుక్క విలవిలలాడుతున్న కసాయిగా ప్రవర్తించి దాన్ని చితకబాదారు.
ఈ వీడియో చూసిన రష్మీ భావోద్వేగానికి గురై వెంటనే ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను పంచుకున్నారు. విచక్షణరహితంగా ప్రవర్తించిన మనిషి భూమిమీద బ్రతికే అర్హత ఎప్పుడో కోల్పోయాడని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇద్దరు అధికారులు 30 నిమిషాల పాటు ఒక మూగ జీవాన్ని కట్టేసి కొడుతుంటే చుట్టూ ఉన్న ప్రజలు ఆ ఘోర హింస ను చూసి ఎలా తట్టుకోగలిగారు వాళ్ల మనసు ఎంత కసాయిది. ఇలా హృదయమే లేని వ్యక్తుల మధ్యల మనము జీవిస్తున్నాం మానవత్వం లేని మానవజాతికి భూమిమీద బ్రతికే అర్హత లేదంటూ ఏడుస్తూ వీడియోను పోస్ట్ చేసింది.
ఈ పోస్టు ద్వారా ఎంతోమంది మంచి వ్యక్తుల మనసులలో మూగ జీవాల గురించి ఆలోచించాలి అనే భావన కలిగిచింది రష్మీ. ఈ విషయం ద్వారా రష్మీ అభిమానుల గుండెల్లో ఫుల్ మార్క్స్ సంపాదించేసింది