యాంకర్ రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు టీవీ చూస్తున్న చంటి బిడ్డ నుండి ముసలి వరకు రష్మి అంటే ఎవరో క్లియర్ గా తెలుసు, ఒక టీవీ షో కు యాంకర్ గా పని చేస్తూ సినీ హీరోయిన్ కంటే ఏ మాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకుంది.
ఇక రష్మి గురించి చెప్పాలంటే జబర్దస్త్ షో లో మొదటి సారి యాంకరింగ్ చేసిన రోజు నుండి ఈరోజు వరకు తెలిసిన అమ్మాయి గానే భావిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు, ఆమె జీవితంలో ఏదైనా శుభకార్యము జరిగితే మా ఇంటి లోని వ్యక్తికే జరిగింది అన్నంతగా సంతోష పడుతూ ఉంటారు.
తను యంకర్ గా చేస్తున్న జబర్దస్త్ షోలో రష్మీ అందాలకు సరైన జోడి అనిపించుకున్న వ్యక్తి సుడిగాలి సుదీర్, వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులైపోయారు, చాలామంది వీరిద్దరూ ఎప్పుడు ఒకటవుతారో అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక జబర్దస్త్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ కూడా ప్రజల ఇష్టాన్ని గమనించి వీరిద్దరికీ ఒకటి రెండుసార్లు పెళ్లి కూడా జరిగినట్టు ప్రోగ్రాంలు చేశారు.
ఇక ప్రజలందరూ వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని బలంగా విశ్వసిస్తున్న సమయంలో, సుధీర్ జబర్దస్త్ ప్రోగ్రాం ని విడిచి వెళ్ళాడు దాంతో ప్రజల్లో ఒక తికమక ఏర్పడింది అయితే రేష్మి మాత్రం సుధీర్ లేడని లోటుగా కనిపించకపోవడంతో ప్రజల్లో ఇంకా ఏదో ఆలోచన కలిగింది.
ప్రజలు రష్మీ గురించి ఇలా ఆలోచిస్తున్న సమయంలో తాజాగా విడుదలైన ప్రోమోలో రష్మీ ఆనంద భాష్పాలు కారుస్తూ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ నాకు పెళ్లి కుదిరింది అని ఓపెన్ గా చెప్పేసింది.
ఆ ప్రోమో చూసిన చాలామంది టీఆర్పీ కోసం ఏదో పబ్లిసిటీ స్టంట్ అయి ఉంటుంది అనుకున్నారు మరి కొంతమంది అయితే సుదీర్ లేకుండా రష్మీ ట్రాక్ ఎవరితో నడపబోతోంది అని కన్ఫ్యూజన్లో పడ్డారు ఇక ఆ షో ఎప్పుడు విడుదలవుతుందో అని ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు చాలా మంది అభిమానులు.
అయితే రష్మీ గతంలో సోషల్ మీడియా ద్వారా అనాధలుగా ఒంటరిగా రోడ్లపై తిరుగుతున్న జంతువుల గురించి ఎమోషనల్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే అలాంటి మంచి మనసున్న రష్మికి అంతా మంచే జరగాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
రష్మీ అన్న మాటలను హార్ట్ టాపిక్ గా హైలైట్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ షో, ఏది ఏమైనప్పటికీ రష్మీ చెప్పిన ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.