వయసు, పెళ్లి పై రష్మీ షాకింగ్ కామెంట్స్ : బట్టలు విప్పి ఉన్నదీ తీసేస్తా అంటూ రచ్చ రచ్చ..

News Trending

రష్మీ ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో అసలు పరిచయమే అవసరం లేని పేరు.సుమారు పది సంవత్సరాల కాలం పాటు వెండి తెరను ఇటు బుల్లి తెరను తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అంతే కాకుండా ఆమె ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకోగలిగారు.అయితే అదే టైం లో వరుస ఆఫర్లను కూడా సంపాదిస్తూ దూసుకెళ్తోంది.అయితే ఈ యాంకర్ ఇటీవలే ఒక స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించి రచ్చ రచ్చ చేసింది. అంతే కాదు తన పెళ్లి మరియు వయసుపై షాకింగ్ కామెంట్స్ చేసింద రష్మీ.

అయితే చాలా కాలం క్రితమే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి నటిగా అడుగు పెట్టింది.అప్పట్లో అనేక చిత్రాల్లో మంచి పాత్రలను కూడా పోషించింది. అయితే ఆలా చాలా కాలం సినిమా పరిశ్రమలో పని చేసిన రష్మీకి అనుకునేంత గుర్తింపు మాత్రం రాలేదు. అలంటి టైం లో ఆమె జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెరలోకి అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది.అయితే ఇందులో తన అద్భుతమైన యాంకరింగ్ తో ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇప్పుడు యాంకర్ రష్మీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేస్తూ దూసుకుపోడానికి ఆమె టాలెంట్ కారణమైతే,ఆమె భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకోడానికి మాత్రం సుడిగాలి సుధీర్‌తో ఉన్న రేలషన్శిప్ పై వచ్చిన పుకార్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచుగా అతడితో ప్రతి షోలో రొమాన్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కేది. దాని ఫలితంగానే ఫలితంగా ఆమె చాల ఫేమస్ అయ్యింది.

ఎంతో కాలంగా కేవలం ఒకే ఛానల్ కి పరిమితం కావడం తో అనేక ఛానల్లో చేసే అవకాశాలను రిజెక్ట్ చేసింది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ జీ తెలుగులో కనిపించింది. జీ తెలుగు ఛానల్ లో వచ్చే ఆదివారం ప్రసారం అవ్వబోతున్న ‘ఆషాడం అత్తాకోడళ్లు’ అనే ఓ స్పెషల్ ఈవెంట్‌లో రష్మీ పాల్గొన్నారు . ఈ ప్రోగ్రాం కి నటి సంగీత స్పెషల్ గెస్ట్ గా రాగ రవి మరియు శ్యామలాలు యాంకర్లుగా ఉన్నారు.

అయితే ఈ షో కోసం రష్మీ బాగానే కష్టపడిందని చెప్పాలి. ఈ ప్రోగ్రాంలో ఆమె ఒక పాటను కూడా పాడింది. ‘కురిసింది మేఘం మేఘం’ అనే పాటను పాడి ఆశ్చర్య పరిచింది. తర్వాత ఆమె డాన్స్ చేసింది మరియు హీరోయిన్ సంగీత తో కూడా కొన్ని స్టెప్పులు వేసింది.

   

ఈ షో లో ఆమె ఓ రేంజ్ లో తెగ రెచ్చిపోయింది.గేమ్‌లో భాగంగా ఓ ప్రముఖ నటిని రెండు చెంపల మీద కొట్టింది. అప్పుడు యాంకర్ గా ఉన్న శ్యామల ‘నువ్వు అత్తలా ఎందుకు చేస్తున్నావ్ నువ్వు కోడలు మాత్రమే’ అని అంటుంది. అప్పుడు రష్మీ అందుకుని ‘ నాకు ఇంత వయసు వచ్చినా ఇంకాపెళ్లి కాలేదు సో నేను డైరెక్టుగా అత్తలా అప్‌గ్రేడ్ అవుతా’ అని తన మీద తనే పంచులు వేసుకుంటూ తన వయసు, పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘ఈ ఈవెంట్ లో యాంకర్ రష్మీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మాటిమాటికి పంచులు వేస్తూ రెచ్చిపోయింది.అంతే కాకుండా మరీ దారుణంగా యాంకర్ రవిని ఒక ఆట ఆడుకుంది ‘నీకు ఉన్నది తీసేస్తా నీ బట్టలు విప్పేస్తా..’ అని ఎన్నో డబల్ మీనింగ్ డైలాగులతో మొత్తం ఆగం ఆగం చేసింది. ఆమెను చుసిన వాళ్ళు అందరూ షాకైపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *