Rashmi varshini

[VIDEO] ఒసేయ్ దొంగ మొహం దానా.. ‘అంటూ స్టేజ్ పైనే యాంకర్ వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ ?

News

జబర్దస్త్ యాంకర్ రష్మీ తెలుసు కదా, తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి స్పెషల్ గా ఎటువంటి పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై రష్మీకి ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు. జబర్దస్త్ లో ఎప్పుడైతే రష్మీ అడుగు పెట్టిందో అప్పడినుండి ఆమె తల రాతే మారిపోయింది.అంతే కాదు జబర్దస్త్ షో మూలంగా తన కెరీర్ కూడా మారిపోయింది. అంతకుముందు రష్మీ చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది , అయినప్పటికీ అంత గుర్తింపు రాలేదు కానీ ఎప్పుడైతే జబర్దస్త్ షోలో యాంకర్ గా చేరిందో అంతే తనకు ఒక్కసారిగా విపరీతమైన పేరు మరియు మంచి గుర్తింపు వచ్చేసింది. దీంతో తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ అయిపోయింది రష్మీ.

తను ఇప్పుడు ఫుల్ బిజీ గా మారిపోయింది.అంతేకాకుండా పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోయింది. రష్మీ చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్ వ్యక్తి అంతేకాకుండా తనకు, సుడిగాలి సుధీర్ కు మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా అందరికీ తెలుసు. ఈ జంటకు బుల్లితెరపై ఎటువంటి క్రేజ్ ఉన్నదో తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు కూడా.

రష్మీ రెసెంట్గా యాంకర్ ఓంకార్ షో అయిన sixth sense 4 లో పాలగిన్నారు. తనతో పాటు ఇంకో యాంకర్ వర్షిణి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు యాంకర్లు కలిసి ఈ షోలో చేసిన రచ్చ అయితే అస్సలు మామూలుగా లేదు. ఇద్దరు కలిసి పిచ్చి పిచ్చిగా రచ్చ రచ్చ చేశారు. మనందరికి తెలుసు ఓంకార్ షో అంటేనే ఎక్కువ టెన్షన్ ఉంటుంది .తెలుసు కదా డబ్బులు గెలవాలంటే ఇద్దరూ నువ్వానేనా అన్నట్లుగా ఆడాల్సిందే. అందుకోసమేనేమో రష్మీ అయితే ఆ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది.

ఆ షోలో ఒక టాస్క్ లో భాగంగా ఎగ్ షెల్స్ పగులగొట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో వర్షిణీ యాంకర్ రేష్మి తో ఆ ఎగ్ పగులగొట్టమంటూ ఒక ఎగ్ ను చూపిస్తుంది. కానీ ఓంకార్ అన్నయ్య మాత్రం అది వద్దు ఇదిగో ఈ ఎగ్ పగుల గొట్టు అంటూ రష్మీకి చెబుతాడు. దీంతో ఒక్కసారిగా యాంకర్ వర్షిణి మీద రష్మీ సీరియస్ అయ్యింది. ఒసేయ్ దొంగ మొహపు దానా నువ్వే కదా ఈ ఎగ్ ను పగులగొట్టమన్నావు అంటూ స్టేజ్ మీదనే ఆరిచేసింది.

అయితే వర్షిణి, రష్మీ ఈ ఇద్దరు యాంకర్లు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి రష్మీ అన్న మాటలను వర్షిణీ అస్సలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంది. దానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published.