టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు. టాలీవుడ్ హేరియన్లల్లో రష్మిక మంచి గుర్తింపును సంపాదించుకుంది.థన్ అందం తో మరియు యాక్టింగ్ తో యూత్ లో మంచి మార్కులు సంపాదించుకుంది. అయితే ఆమె చాలా చాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు ఆ సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకుంది, అంతేకాకుండా తన నటనకు మంచి మార్కులు కూడా కొట్తసింది ఈ ముద్దుగుమ్మ.దాంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో గీతా గోవిందంలో నటించే అవకాశం పొందుకుంది.
ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు రేంజ్ ఒకేసారి ఆకాశాన్ని అంటింది. ఆమెకు తర్వాత నుండి వరుసగా అన్ని చిత్ర పరిశ్రమల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లోను అడుగు పెట్టబోతున్నారు. ఆలా ఈ కన్నడ బ్యూటీ వెనక్కి తిరిగి చూడకుండా చేతి నిండా సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.
ప్రస్తుతం రష్మికా బాలీవుడ్లో మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో యాంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తనతో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది అని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అమితాబ్ తో గుడ్ బాయ్ చిత్రానికి కూడా ఆమె సంతకం చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లోనే కాదు రష్మికా తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయారు.
ఇటీవలే కార్తీ హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాలో రష్మికా కనిపించింది.అలా సుల్తాన్ సినిమాతో ఆమె తమిళం లోను తన నటన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు . అంతే కాదు రష్మికాకి బాలీవుడ్ లో మరో బడా డైరెక్టర్ నుండి అవకాశం కూడా వచ్చిందటా. ఆ డైరెక్టర్ రశ్మికను సంప్రదించగా ఆమె ఆ సినిమా కు నో చెప్పిందట. ఎందుకో తెలుసా..?
ఆమె ఆ చిత్రం లో హీరోకి భార్యగా నటించడమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీ గా మరియు 10 సంవత్సరాల పాపకు తల్లిగా నటించాలి అని ఆ డైరెక్టర్ చెప్పడంతో రష్మికా నో చెప్పేసిందట. ఈ టైం లో కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తున్న రష్మిక సడ్డెన్ గా తల్లిగా కనిపిస్తే తన కెరీర్ కె ప్రమాదం అని భావించిందట.
తనకు తరువాత హెరాయిన్ పాత్రలు ఎవరు ఇవ్వరని ఆమె అభిప్రాయం. కాబట్టి మొఖం పైనే డైరెక్టర్ కి నో చెప్పడం తో ఈ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చేసింది కొన్ని సినిమాలే ఐన రష్మిక తీసుకున్న నిర్ణయం చాలందిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలామంది రష్మికా మెచూర్ గా ఉంది ఆమె సినిమా భవిషత్తు కు ఎటువంటి డోకా లేదు అని కామెంట్స్ పెడుతున్నారు తన సమాధానం విన్న వాళ్ళందరూ.