యాంకర్ లేకుండా ఏదైనా షో ఉంటుందా. అసలు ఊహించు కొగలమ , ఒక షో హిట్ అవ్వాలన్న ఫ్లాప్ అవ్వాలన్న యాంకర్ దే పూర్తి బజ్యతా ఉంటుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టని ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఎనర్జీ లెవల్స్ ను పెంచే కంట్రోల్ యంకర్ వద్దే ఉంటుంది. ఈ రోజుల్లో యాంకర్ అనే పేరు ఎత్తగానే గుర్తుకు వచ్చే పేర్లు సుమ, రష్మి , అనసూయ , శ్రీముఖి లు మేల్ యాంకర్లలో అయితే ప్రదీప్ సుదీర్ రవీలు ఇవన్నీ నేటి తరంలో బాగా వినిపిస్తున్న పేర్లు అయితే ఇప్పుడు ఉన్నట్టు టెక్నాలజీ మరియు పబ్లిసిటీ లేని రోజుల్లో అసలు యాంకర్ అంటే కూడా సరిగా ప్రజలకు అర్దం కానీ తొలి రోజుల్లో ఒక వెలుగు వెలిగిన ఎకైక యాంకర్ ఉదయబాను , ఉదయభాను ను నేటి యాంకర్లకు మూలం అని చెప్పుకోవచ్చు , అపటి వరకు సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న యాంకర్ పాత్రకు ఎంటర్టైన్మెంట్ జోడించి మంచి తెలంగాణ యాసలో యాంకరింగ్ అనే పదానికి కొత్త అర్దం తెచ్చి పెట్టింది ఉదయభాను.
ఇంత గొప్ప యాంకర్ ఇప్పుడు ఎవరికీ కనిపించకుండ కనుమరుగై పోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఆమెను కావాలనే పరిశ్రమకు దూరం చేశారు. అయితే ఎవరు ఎందుకు ఉదయభాను జీవితం తో చలగాటం అడారో ఇప్పటికీ క్లారిటీ లేక ప్రేక్షకుల మధ్య ఈ అంశం చర్చనీయాంశం గా ఉండి పోయింది. కానీ ఆమె ఇలా కనుమరుగై పోటనికి కారణం మాత్రం అప్పటి సెలబ్రిటీలే ఆమె ఎదుగుదల తట్టుకోలేక కొని ఆ వాస్తవాలను ఆమెపై పుట్టించి ప్రచారం చేశారు. దాంతో ఆమెకు అవకాశాలు రావడం పూర్తిగా మానేశాయి మరియు పరిశ్రమలో తనకంటూ ఒక కెరీర్ లేకుండా చేశాయి. ఆ తర్వాత మెళ్లిగా టీవీ షో నుండి తొలగి అజ్ఞాతంలో కలిసిపోయింది .
ఒకవేళ ఎప్పుడైనా టీవీ లో కనిపించిన తన పిల్లలు మరియు భర్తతో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నానని మాత్రమే చెబుతుంది తప్ప మిగితా విషయాల గురించి మాట్లాడదు భాను. అంటే ఆమెకు తన జీవితంలో ఎవరివల్లో బయం మరియు తీవ్ర బాధ అనుభవించి ఉంటుందని క్లియర్ గా అర్దం అవుతుంది . అందుకే వారికి భయపడి కెరియర్ కి పులి స్టాప్ పెట్టి ఉంటుందనే అనుమానం ప్రజల్లో ఉంది. అయితే ప్రేక్షకులకు మాత్రం ఆమెను మరో సారీ యాంకర్ గా చూడాలనుకుంటున్నారు.