regina-cassandra

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న పాప ఇప్పుడు యూత్ మొత్తాన్ని తన అందంతో కట్టిపడేసిన స్టార్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..?

Movie News Uncategorized

రెజీనా కాసాండ్రా ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళ మరియు తెలుగు చిత్రాలలో నటించింది. శివ మనసులో శ్రుతి (2012) లో నటించినందుకు ఆమె తెలుగులో ఉత్తమ మహిళా డెబ్యూట్ అవార్డును గెలుచుకుంది.

రెజీనా కాసాండ్రా 13 డిసెంబర్ 1991 న భారతదేశంలోని మద్రాసులో (ఇప్పుడు చెన్నై) జన్మించారు.ఆమె మాతృభాష తమిళం. ఆమె మొదటి చలన చిత్రం కందా నాల్ ముధల్ (2005). తరువాత ఆమె కన్నడ చిత్రం సూర్యకాంతి (2010) లో దర్శకుడు కె. ఎం. చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా లో నటించింది.

2012 లో, తతీనేని సత్య యొక్క శివ మనసులో శ్రుతిలో నటించింది, ఇది 2009 తమిళ చిత్రం అయిన శివ మనసుల శక్తికి రీమేక్. ఆమె తరువాత తెలుగు రొమాంటిక్-కామెడీ మూవీ రొటీన్ లవ్ స్టోరీ లో సుందీప్ కిషన్ తో కలిసి కనిపించింది, ఈ సినిమా ను ఆమె మొదటి తెలుగు సినిమా రిలీస్ అవ్వకముందే సంతకం చేసింది.

ఈ తరం నటీమణులు నటన యొక్క సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఓ రేంజ్ కథానాయికలుగా ఆకట్టుకుంటున్న సమయంలోనే ఐటమ్ సాంగ్స్‌తో అభిమానులను అల్లరిస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి విలన్ పాత్రను కూడా పోషిస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు బ్యూటీ స్టార్ రెజీనా.

Regina-Cassandras-childhood-photo

తెలుగుతో పాటు ఇతర భాషలలో నటించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈ యువ నటి చాలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు.ఆమె ‘హూ’ చిత్రంలో విలన్ పాత్రను పోషించడం ద్వారా చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం విజయానికి ఆమె కీలక పాత్ర పోషించారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇంతలో రెజీనా మరోసారి విలన్ షేడ్స్ పాత్రను పోషించింది.

విక్రమ్ నటించిన ‘చక్ర’ చిత్రంలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనాకు మంచి మార్కులు వచ్చాయి. నెగెటివే పాత్రలో కనిపించిన రెజీనా ఈ పాత్రకు అనుగుణంగా జీవించింది. ఈ పాత్ర గురించి రెజీనా మాట్లాడుతూ లీలా పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దర్శకుడు ఆనందన్ తనకు రెండుసార్లు కథ వినిపించారు అని రెజీనా తెలిపింది.

మొదట్లో ఈ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించలేదు. తరువాత, సినిమాటోగ్రాఫర్ బాలసుబ్రమణియన్ పిలిచి, మీరు విలన్ పాత్రలో నటిస్తే బాగుంటుందని అన్నారు. దీంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. భవిష్యత్తులో కూడా విభిన్నమైన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ లెక్కను చూస్తే .రెజీనా విలన్ క్యారెక్టర్‌కు మొదటి ఆప్షన్ అని అనిపిస్తుంది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, రెజీనా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు. తాను ఏం చేస్తున్నారో తన అభిమానులకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతు వివరిస్తూ ఉంటారు.రీసెంట్ గా ఆమె తన చిన్నప్పటి ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసింది, ఆమే అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.చాలా మంది లైకులు కామెంట్స్ పెడుతూ వారి అభిమాన నటి చిన్నప్పటి ఫోటోలు వారి అకౌంట్స్ లో షేర్ చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *