regina-new-ad

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెజీనా గుర్తింపును తుడిచివేసే ప్రయత్నం చేస్తున్న నెటిజనులు.

News

బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన తమ సెంటిమెంట్లను హార్ట్ చేస్తే ప్రజల చుక్కలు చూపిస్తారు , ఇంకా ఆ రీతిగా ప్రవర్తించింది ఒక నటుడు లేదా నటి అని తెలిస్తే ఇంకా మామూలుగా ఉండదు, ప్రజల విమర్శలు తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు, తాజాగా ఈ రకంగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులకు దొరికిన నటి రెజీనా కసాండ్రా.

రెజీనా కసాండ్రా తన కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాలకు బాగా ప్రాధాన్యం ఇచ్చేది ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాల్లో చేస్తోంది, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ఎవరు లో నటించింది, ఇక ఆమె ప్రస్తుతం నేనే నా అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమా తెలుగు మరియు తమిళ రెండు భాషల్లో రానున్నది.

regina-new-ad

ఇలా సక్సెస్ తో దూసుకెళ్తున్న సెలబ్రిటీలకు ఖచ్చితంగా ఏదో ఒక ఉత్పత్తుల సమస్త తమ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి వాడుకుంటారు, ఇదే రీతిగా ఒక ఉత్పత్తి సంస్థ రెజీనా ను తమ మద్యాన్ని ప్రచారం చేయడానికి కొరకు ఉపయోగించుకున్నారు, ఆ సదరు ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్న వీడియో లో విస్కీ గ్లాసు పట్టుకొని ఈ జర్నీ నాకు నిధి లాంటిది అంటూ ఆ మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేసింది.

ఇక ఇదే ఆడ్ ను తన ఇంస్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసి దానికి ఈ రకమైనటువంటి లైన్లు జోడించింది నా జీవితంలో తొమ్మిది ఏళ్ళ వయసు నుండి ఫిలిమ్స్, కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ చేశాను ఈ ప్రయాణం అంతా కూడా నాకు ఒక నిధి లాంటిది అని పెట్టి పోస్ట్ చేసింది, ఆమె ఆ పోస్టు చేసిన తర్వాత చాలా మంది నెటిజన్లు చూసి మా అభిమానం తనకు మద్యం ఇచ్చే మత్తుల కనిపించిందా అని కోప్పడ్డారు.

ఆమె పోస్ట్ ను విపరీతంగా ట్రోల్ చేస్తూ డిస్ లైక్ కొడుతున్నారు కొంతమంది ఆమె ఖాతాను అన్ ఫాలో చేస్తున్నారు. అన్ ఫాలో చేసే వ్యక్తులు కూడా మిగతా వారిని అన్ ఫాలో చేసేటట్టు కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు, డబ్బు కోసం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే ఇట్లాంటి వాటిని ఎట్లా ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రజలు అభిమానించే వ్యక్తి ఎవరైనా సరే ఈ రకంగా ఒక ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయడం ఖచ్చితంగా వివాదాస్పదమవుతుంది, ఇక ప్రజలు తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్న విషయానికి ఎలాగ స్పందిస్తుందో ? ప్రజలకు క్షమాపణ చెబుతుంద లేదా సమర్ధించుకుంటుంద వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.