వర్మ చూపంతా అక్కడే…అరియానా వర్మ జిమ్ వర్కౌట్స్ ఫోటోస్ వైరల్..!

Movie News

రామ్ గోపాల్ వర్మ తరచుగా ముఖ్యాంశాలకు ఎక్కుతూ ఉంటాడు, కానీ ఈ రోజుల్లో, ఇది సాధారణంగా అతని చిత్రాల వల్ల కాదు. ఒకప్పుడు శివ, సత్య, రంగీలా వంటి గొప్ప సినిమాలు మనకు ఇచ్చిన చిత్రనిర్మాత ఇప్పుడు వివాదానికి ఇష్టమైన బిడ్డ అని చెప్పడం అతిశయోక్తి కాదు.

వర్మ ఏది చేసినా అది హాట్ టాపిక్ అయిపోతుంది.సినిమాల్లో తన విభిన్నమైన కథలతో ,పాత్రలతో ఎంత ఇంపాక్ట్ సృష్టిస్తాడో అదే విధంగా సోషల్ మీడియా లో కూడా తనదైన స్టైల్ తో పోస్టులు పెడుతూ వివాదానికి దారితీస్తుంటాడు.అయితే ఈ మధ్య కాలం లో బిగ్ బాస్ ఫేమ్ అరియానా తో జిమ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే అయితే మరోసారి అదే జిమ్ లో అరియానా తో మళ్ళీ ఫోటోలు దిగి సోషల్ మీడియా లో షేర్ చేసిన కొన్ని క్షణాల్లోన్నే వైరల్ గా మారాయి.

అరియానా ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసాడు వర్మ.అయితే అవి పోస్ట్ చేస్తూ ‘ఈమె ఎవరో గుర్తు పట్టండి’ అంటూ అరియానా ఉన్న ఫోటో కి క్యాప్షన్ పెట్టాడు. ఆ ఫోటో వైరల్ గా మరీనా కొన్ని క్షణాలకే ఇంకో ఫోటో అప్లోడ్ చేసాడు.అందులో వర్కౌట్స్ చేస్తున్న అరియాన నడుమును చూస్తూనట్టు పోజ్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

ఇంకా ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు వర్మను ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేయడం ప్రారంభించారు. అరియాన నడుముకు ఫిదా అయిపోయిన వర్మ అని కొందరు కామెంట్స్ పెడుతుంటే ఇంకొందరు వ్యంగ్యంగా చాలా కామెంట్స్ చేసారు.

ఇదిలా ఉంటే వర్మ తో చేస్తున్న ఇంటర్వ్యూ హైప్ కోసమే ఈ పోస్టులు అన్ని అప్లోడ్ చేస్తున్నారు అని తెలుస్తోంది.ఆ ఇంటర్వ్యూ లో అరియానా వర్మ ల మధ్య జరిగే డిస్కషన్ కి ప్రమోషన్ గా ఈ ఫొటోస్ ఉపయోగించుకుంటున్నారు.

నిజానికి ఎక్కడో షార్ట్ ఫిలిమ్స్ ఇంటర్వ్యూ లు చేసుకునే అరియానా ను పాపులర్ చేసింది వర్మనే అని చెప్పక తప్పదు. గతం లో వర్మ ను ఇంటర్వ్యూ చేస్తుండగా అరియానా ను వర్మ ‘నిన్ను బికినీ లో చూడలనుకుంటున్న’ అని అన్నాడు .

అంతే ఆ మాట తో అరియానా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అంతే కాదు దాంతో అనేక బిగ్ బాస్ 4 లో అవకాశం కూడా వచ్చింది.కాబట్టి ఈసారి కూడా అరియానా ఏదో ప్లాన్ గట్టిగానే చేసి ఉంటుంది అని టాక్ నడుస్తుంది.ఆమే కు వర్మ సినిమా ఛాన్స్ ఇస్తాడు అనే చర్చ కూడా నడుస్తుంది.ఏది ఏమైనా వారిద్దరిలో ఎవరో ఒకరూ స్పందించే వరకు ఈ రూమర్స్ నడుస్తూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *