RGV : అది తప్పు ఎలా అవుతుంది..? రాజ్ కుంద్రా చేసింది తప్పు కాదు..

News

ఆ సినిమాలు తీసిన కేసులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ అరెస్ట్ తర్వాత ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బి గ్రేడ్  ఫిలిమ్స్ ను రూపొందించి ఒక విదేశీ యాప్ లో అప్‌లోడ్ చేస్తున్నారనే నేరారోపణతో అరెస్ట్ అయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై మరింత లోతుగా విచారణ చేయాలని ముంబై పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్ కుంద్రా తో సంబంధాలు కలిగి ఉన్న ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టకుండా విచారిస్తున్నారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు. అయితే తన వ్యాఖ్యలతో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టించే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జరిగుతున్న నాటకీయా పరిస్థితుల నడుమ ఆ వీడియో ల పై తనదైన శైలిలో ప్రతిస్పందించడమే కాకుండా, షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు.

ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ రాజ్ కుంద్రా అరెస్ట్ సమస్య పై మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ మొదలవ్వడంతోనే తన దృష్టిలో అసలు అదే  బంగారం అంటూ తన స్టైల్ లో కామెంట్ చేసాడు. ఇద్దరు వ్యక్తులకు ఇష్టమైనప్పుడు చేసుకోవడమూ అసలు తప్పు ఎలా అవుతుంది, ఆ ఇద్దరి అంగీకారంతో మరొక వ్యక్తి దానిని చిత్రీకరించడం లోను తప్పు అసలే లేదనేది నా అభిప్రాయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు రామ్ గోపాల్ వర్మ. అందులో అసలు తప్పు లేదు అంటూ ఓపెన్‌గానే చెప్పేసాడు. ఒకవేళ అది బలవంతంగా అయితే తప్పు అని ఆయన అన్నారు.

RGV వివరిస్తూ .. కొన్నేళ్ల క్రితం వరకు కొన్ని కేటగిరీస్ ఉండేవని చెప్పుకొచ్చారు. సింగిల్ గా  ఉంటే కొంచెం అని, డబల్ గా  ఉంటే కొంచెం ఎక్కువ అని, త్రిబుల్ గా  అని ఉంటే అది పూర్తిగా అని అర్థం అంటూ తన వీడియో లైబ్రరీ రోజుల సంగతులను జ్ఞాపకం చేశారు వర్మ. అంతే కాకుండా ఇంటర్నెట్లో ఎన్నో వేల వీడియోలు ఉన్నాయని ఒకవేళ అవి బయటకు తీస్తే ఎంతో మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే రాజ్ కుంద్రా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త కాబట్టి ,అంతే కాకుండా అతను ప్రముఖ వ్యాపారవేత్త కూడా కాబట్టి ఈ విషయం బాగా హైలైట్ అవుతుంది తప్ప మరేమీ లేదని ఆయన పేర్కొన్నాడు.

అయితే ఆ వీడియోలు చిత్రీకరించాడని మరియు ఆ వీడియోస్ ని వేరే వాళ్లకు చూపిస్తూ వ్యాపారం చేయడంలో చాలా వెత్యాసం ఉందన్నారు వర్మ. అయితే ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫార్మ్ వల్ల చెడిపోతున్నారని చెప్పడం సరికాదు. నచ్చితే చూడండి నచ్చకపోతే ఓటీటీ చూడకండి అంతే. చూడటం వల్ల సొసైటీ కి ఎటువంటి నష్టం ఉండదని వర్మ అభిప్రాయపడ్డారు. చూడడమూ మానేసినంత మాత్రాన సమాజంలో దారుణాలు ఆగిపోతాయి అనుకోవడం మూర్కత్వం అని అయ్యన అన్నారు. టైంను బట్టి పరిస్థితులకు మారుతూ వస్తాయని, వాటినే మనం ఫాలో అవుతాం అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *