దర్శకుడు రాజమౌళి ని ‘బోడి నా కొడుకు’ అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్.! స్టేజి పై ఉన్న అందరూ షాక్..

Movie News Trending

వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ అసలు ఎప్పుడు ఎవరిపై కామెంట్స్ చేస్తాడో చాలా కష్టం. ప్రతిసారి ఆయన అభిమానులు ఎవరిని టార్గెట్ చేస్తాడా అంటూ ఎదురుచూస్తుంటారు. అయితే అలాంటి వివాదాల డైరెక్టర్ స్టేజి ఎక్కి మైక్ పట్టుకుంటే ఎలా ఉంటుంది. అలాంటి ఒక సీన్ రీసెంట్గా జరిగిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది.

సునీల్ కనబడుటలేదు అనే సినిమా కు వర్మ మరియు దర్శక ధీరుడు రాజమౌళి గారి నాన్న గారు విజయేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా పాలుగోన్నారు. ఈ ఈవెంట్ లో వర్మ కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసాడు. ఎప్పుడు ఇంటర్నెట్లో ఈ ఈవెంట్ కి సంబంధించిన వర్మ స్పీచ్ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఆ ఈవెంట్లో వర్మ మైక్ తీసుకొని .. “నేను ఏ సినిమాలో అయినా హీరోయిన్ నే చూస్తాను. చిన్నప్పటినుండి నాకు ఈ అలవాటు ఉందంటూ” వర్మ అందరిని నవ్వించాడు. తరువాత అతని దృష్టి విజయేంద్ర ప్రసాద్ గారి గడ్డం మీద పడింది. ఏదో సినిమా కి సంబంధించిన ప్రశ్న అడుగబోతున్నాడు అని అందరూ ఇంటరెస్టింగ్ ఎదురుచూస్తున్నప్పుడు.. వర్మా ” మీరు గడ్డం ఎందుకంత పెద్దగా పెంచుతన్నారు? మీరు గడ్డం పెంచడానికి మోడీ గారు ఏమైనా స్ఫూర్తా.? లేదా నా బోడి కొడుకే అంత పెంచుతుంటే నేనేం తక్కువ తిన్నానా అని పెంచేస్తున్నారూ అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. దానికి విజయేంద్ర ప్రసాద్ వర్మకు ఓ దండం పెట్టాడు.

ఏదేమైనా వర్మ తన డౌట్ ను అడిగి ఒక బరువు దించేసుకున్నాడు అంటూ వింతగా సెటైర్లు వేస్తున్నారు వర్మ అభిమానులు.

అయితే ఇదిలా ఉంటె ఇప్పుడు వర్మ ఉదయ్ కిరణ్ కథపై కూడా దృష్టి పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అతను సూసైడ్ ఎపిసోడ్‌కి ట్విస్ట్ ఇవ్వడం ద్వారా ఉదయ్ మరణాన్ని ఎగతాళి చేస్తాడా లేదా అతను నటుడి వివాహ ఎపిసోడ్‌పై దృష్టి పెడతాడా అనేది తెలియదు, కానీ అతను ఈ చిత్రం కోసం ఇప్పటికే “హృదయ కిరణ్” అనే టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు.ఒక వారంలో స్క్రిప్ట్‌ను రెడీ చేయడం, మరియు కేవలం 2-3 రోజుల వ్యవధిలో ఆ చిత్రాన్ని షూట్ చేయడం మరియు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సైట్‌లలో త్వరితగతిన విడుదల చేయడం ఈ రోజుల్లో వర్మ యొక్క అలవాటుగా మారింది.

అయితే, ఈ సినిమాలు ఎలా ప్రదర్శించబడుతున్నాయనేది వర్మకు మాత్రమే తెలుసు, ఎందుకంటే అతని సహచరులు వారు కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, వర్మ ఎంతకాలం వివాదాలకు దిగుతూనే ఉంటాడు అనేది పెద్ద ప్రశ్నలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *