ఆలయంలోకి మందు బాటిల్​తో, దేవతకు మందు పట్టించిన రామ్ గోపాల్ వర్మ,

News

ఏదో రచ్చ లేకుండా ఉండలేని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, ఏదోక వివాదం సృష్టిస్తేనే పబ్లిసిటీ అని ప్రతి విషయాన్ని రచకిడుస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలను ఏదురుకున్నపటికి తనలో అణువంత మార్పు కూడా కనుపర్చుకోకుండ అదే ఫార్మాట్ లో ఉంటాడు.

ఆయన వ్యక్తిగత జీవితమైనా సినిమాలైనా వివాదం లోనే ఉంటాయి, గతంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన రక్త చరిత్ర సినిమా కు పొలిటికల్ గా మరియు రీజినల్ గా ఎన్నో వివాదాలు తలెత్తిన ఎవరికీ జంకకుండా సినిమాలు నిర్మించాడు. రక్త చరిత్ర సినిమా రెండు భాగాలుగా నిర్మించి తన పౌరుషాని చూపించి ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇదే ట్రెండ్ ఆయన శిష్యులైన ఎంతో మంది డైరెక్టర్లకు వంటబట్టింది మరియు ఆయన లాగానే ఎవరికీ భయపడకుండా సినిమాలు తీయాలనే స్ఫూర్తిని ని నింపింది.

ఆ తర్వాత మళ్లీ అంతే రచ్చకు తెరతిసే సినిమాలు ఎన్నో చేశాడు సామాన్యంగా ప్రజలెవరూ ఒప్పుకోనటువంటివి, సెన్సార్బోర్డు అంగీకరించనటువంటి సినిమాలు తీసి తేయేటర్లలో వాటిని ఒప్పుకోరు గనుక తన సినిమాలు ప్రేక్షకులు రిలీజ్ రోజునే చూసే రీతిగా ఓటీటీ లాంటి ఒక వెబ్ సైట్ ను నడిపిస్తు ఉన్నాడు.

గతంలో పవర్ లో ఉన్న రాజకీయ వ్యక్తుల పైన సినిమా తీశాడు అది అప్పట్లో పెద్ద అలజడి సృష్టించింది ఆ విషయమై గోపాల్ వర్మ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సినిమా మార్చుకోవాల్సి ఉండగా అదే సినిమాకు పేరు మార్చి థియేటర్లో విడుదల చేశాడు. ఇక అదే ట్రెండ్ ను తెలంగాణ వైపు కూడా తీసుకొచ్చి తెలంగాణ రక్త చరిత్ర ను కూడా తెరకెక్కిస్తాను అంటూ చాలెంజ్ చేసి వరంగల్ వేదికగా షూటింగ్ ప్రారంభించాడు.

ఈ సినిమా కొండ మురళి కొండా సురేఖ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే సినిమా షూటింగ్ కొరకు వరంగల్ ను లొకేషన్ గా ఎంచుకొని ప్రారంభించగా సురేఖ దంపతులు రామ్ గోపాల్ వర్మ తమ ఇంట్లోకి ఆహ్వానించు కొని ఆరతి పట్టి , దిష్టి తీసి అతిధి సత్కారం చేశారు , అయితే కొండా దంపతులు ఈ రీతిగా రాంగోపాల్ వర్మ గౌరవించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక నాస్తికుడైన రాంగోపాల్ వర్మ సాధారణ హిందూ పద్ధతులలో మైసమ్మ దేవి గుడికి వెళ్లి పూజలు నిర్వహించాడు. అదేగాక దేవికి మద్యాన్ని కూడా పట్టించాడు, ఇక ఇదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ రీతిగా పంచుకున్నాడు వోడ్కా నేను మాత్రమే తాగుతానని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మవారి కూడా విస్కీ పట్టించానని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ఇక ఇదే విషయం పై నెటిజనులు రామ్ గోపాల్ వర్మ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే మద్యము అమ్మవారికి సమర్పించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగమే అంటూ తాను చేసిన పనిని సమర్ధించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఇక తాను నిర్మిస్తున్న కొండ సినిమా షూటింగ్ పనులు వేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. మరియు అమ్మవారికి మద్యం పట్టించడం అనే విషయం సినిమా లో ఒక సీన్ అంటూ కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *