అమ్మాయి ఎదిగి పెళ్లీడుకు వస్తుంది అనగానే ఎవరైనా అడిగే మొదటి ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన పెళ్లిచూపులు హీరోయిన్ కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నానని చెప్పింది.
ఒక ఇంట్లో అమ్మాయి ఉందంటే ఒక వయసు వచ్చేసరికి తనకు జరగాల్సిన ముచ్చట్లు జరిగిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. జరగాల్సినవి జరగకుండా లేట్ అవుతున్నట్లు అయితే ఆ అమ్మాయి లో లోపం ఉందంటూ సమాజం వేలెత్తి చూపుతుంది. గొప్పింటి అమ్మాయి పేదింటి అమ్మాయి అని తేడా లేకుండా ప్రతి అమ్మాయి ఎదుర్కొనే ఘట్టం ఇది. అయితే సాధారణ ప్రజానీకానికి కంటే ఎక్కువగా హీరోయిన్లు ఈ ప్రశ్నను ఎదుర్కొంటుంటారు ఏదైనా సందర్భంలో మీడియాకు ఎదురైతే కచ్చితంగా హీరోయిన్లు ఎదుర్కొనే మొదటి ప్రశ్న పెళ్లి కి సంబంధించిందే అయి ఉంటుంది.
ఇక తాజాగా వరుడు కావలెను సినిమా విడుదలకు సిద్ధం కానుండగా ఈ చిత్ర బృందం ఒక మీడియా ఛానల్ లో సినిమా ప్రమోషన్ కొరకు ఒక ఇంటర్వ్యూకు హాజరు అవ్వగా ఆ సినిమా హీరోయిన్ రీతుకు నీ పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు రీతు స్పందిస్తూ నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది బహుశా అది మూడేళ్ళలో లేదా ఐదేళ్లలో అయ్యుండొచ్చు అంటూ నా పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ఎన్నడూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు అని, నా పెళ్లి విషయం పూర్తిగా నాకే వదిలేశారని చెప్పింది. అయితే అప్పుడప్పుడు మాత్రం సరదాగా నన్ను ఆట పట్టించడానికి నీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంటారు అని చెప్పింది. ఇక నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నాకు బాయ్ ఫ్రెండ్ లేదా లవ్వర్ లేడు కాని నాకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది అందుకే పెళ్లి అనే ఆలోచనకు దూరంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. దీన్ని బట్టి ఆమెకు లవర్ లేడు అని కన్ఫర్మ్ అయింది.
ఇక సితార ఎంటర్టైన్మెంట్ మరియు పి డి వి ప్రసాద్ గారి సమర్పణలో విడుదలకు సిద్ధం కానున్న వరుడు కావలెను సినిమా గత దసరాకే విడుదల కానుండగా కొన్ని ముఖ్యమైన కారణాలవల్ల సినిమా వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల కానుంది.