జబర్దస్త్ షో చూసే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హైపర్ ఆది. స్కిట్టు ప్రారంభం నుండి అంతం వరకు విరివిగా పుంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవించేస్తాడు. కొంతమంది ప్రేక్షకులైతే కేవలం ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవారీగా మారారు. ఆది తనదైన శైలి కామెడీతో గొప్ప ఆదరణ పొంది పస్తుతం ఇతర కార్యక్రమాలతో పాటు సినిమా అవకాశాలను కూడా పొందుకుంటున్నాడు.
ఇక జబర్దస్త్ స్టేజ్ పైన ఆది ఎలా పర్ఫార్మ్ చేస్తాడో మనకు బాగా తెలుసు, ఒకప్పటి సినిమా నటి నటులను అలాగే కొత్త అమ్మాయిలను ఆయన స్కిట్ లో పాత్రలు ఇచ్చి వాడుకుంటాడు.అల వచ్చిన కొంత మంది జబర్దస్త్ లో స్థిర పడిపోయారు.
ఇక అనసూయ ఆది గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మి సుడిగాలి సుదీర్లా లవ్ ట్రాక్ ఎంత ఫేమసో జబర్దస్త్ లో ఆది అనసూయల ట్రాక్ అంతే ఫేమస్ కానీ ఆది అనసూయ మధ్య అర్దం అయి కానట్టు ఉండే ట్రాక్ కు ఏ పేరు పెట్టాలో తెలియక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు . ఆది అనసూయలు కూడా క్లారిటీ ఇవ్వకుండా ఈ అంశాన్ని రక్తి కట్టిస్తారు.
జబర్దస్త్ షో నిర్మాణ సమస్త ఈ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వీల్ల ట్రాక్ ను హైలైట్ చేస్తూ మంచి టి ఆర్ పి రబట్టుకుంటుంది . ఆది అనసూయను తన స్కిట్టు లలో ఏదో ఒక రీతిగా నటించే లా చేస్తాడు. ప్రతి స్కిట్ లో అనసూయ తో దుయెట్ ఉండేలా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు. అందుకే ఈ జోడీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు .
ఇక తాజాగా డిసెంబర్ 2 వ తారీకు ప్రసారం అవ్వబోతున్నా జబర్దస్త్ షో ప్రమొను విడుదల చేయగా ఆది పంచుల మీద పంచులు వేస్తూ కనిపించాడు. అదే సమయం లో అనసూయ ఈ లాక్ ఓపెన్ చేయవ అని అడిగితే , నువ్వు అడిగితే లాక్ ఏంటి లిప్ లాక్ అయిన రెఢీ అంటే రోజా కామెంట్ చేసింది. రోజా అల అనగానే అనసూయ సిగ్గు పడుతూ కనిపించింది ఆది కూడా సిగ్గుపడుతూ స్మైల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ప్రమొలో అనసూయ నా చెలిని టచ్ చేయాలంటే నన్ను టచ్ చేయాలి అని అంటుంది. దాంతో ఆది నేను రెడీ అని డైలాగ్ విసురుతూ ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా అనసూయ నవ్వుతుంది . ఇక ఈ ప్రమోతో వచ్చే వారం జబర్దస్త్ షో గట్టి టీ అర్ పి సంపాదించ బోతుందని క్లియర్ గా అర్దం అవుతుంది.