Roja Warning to emmanuel

నేను ప్రేమించాను మేడం అంటూ రోజా పైకి వేలు ఎత్తి చూపిస్తూ అరిచాడు

News

బుల్లితెర పైన ఎన్ని యేండ్లయినా ఎడతెరిపి లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఏకైక షో జబర్దస్త్ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతోమంది చిన్న చిన్న వ్యక్తులు మంచి గుర్తింపును పొంది గొప్ప స్థాయికి ఎదిగారు. గత తొమ్మిదేళ్లుగా ప్రజలకు మంచి వినోదాన్ని అందిస్తూ రోజంతా పని చేసి అలసి పోయి ఉన్న వారి నోటి పైన ఒక చిరునవ్వును తీసుకొచ్చే షో గా జబర్దస్త్ ప్రసిద్ధి చెందింది.

అదేగాక జబర్దస్త్ లో ఉన్న కొంత మంది ఆర్టిస్టులు షో ద్వారా గుర్తింపు పొంది వేరే ఏ ఇతర షోకి వారు ఆహ్వానించ బడిన ఆ షోకి ఘోరంగా టిఆర్పీని పెంచే స్థాయికి కొంత మంది ఆర్టిస్టులు ఎదిగారు. వారిలో ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకున్న వారు రష్మి సుధీర్, రష్మీ . సుధీర్ ల మధ్యల ఉన్న సస్పెన్స్ ప్రేమగోలకు ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. వారిని నిజంగానే ఒకటి గా చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే వీరి ద్వారా షో హైయెస్ట్ టిఆర్పి లను సంపాదిస్తోంది కనుక ఈ ట్రాక్ ను జబర్దస్త్ నిర్మాతలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Roja Warning to emmanuel
Roja Warning to emmanuel

ఇంకా ఇదే కోవలో హైపర్ ఆది కూడా ఉన్నాడు కానీ తన స్టోరీ ఇంతగా సక్సెస్ కానప్పటికీ తాను వేసే పంచుల ద్వారా ప్రేక్షకులలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇక కొత్తగా వచ్చిన ఇమ్మానియేల్ తన భవిష్యత్తు పైన గొప్పగా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ ఇమ్మానియేల్ కు మంచి లైఫ్ ఇచ్చింది, అతికొద్ది సమయంలోనే అదివరకే ఉన్న టాప్ ఆర్టిస్టులతో పోటీపడి ప్రదర్శించే స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా ఇమ్మానుయేలు వర్షాలు పండించే లవ్ ట్రాక్ వారి స్కిట్ కు అందాన్ని తీసుకొచ్చింది. వీరి లవ్ ట్రాక్ విజయవంతంగా కొనసాగుతూ ఉంది.

అయితే గత కొంత కాలంగా ఇమ్మానియేల్ మరియు వర్ష మధ్యల గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా విజయదశమి నాడు ప్రసారమైన ప్రోగ్రాం లో ఇమ్మానియేల్ గురించి రోజాకు కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్ము కూడా తనదైన స్టైల్ లో రోజాకు తమ మధ్యలో గ్యాప్ వచ్చిన విషయాన్ని కంప్లైంట్ రూపకంగా రోజాకు చెప్పాడు. అయితే రోజా వర్షపు సపోర్టు ఇస్తూ ఇమ్మానుయేలు కు వార్నింగ్ ఇచ్చింది . అయితే ఈ సమయంలో ఇమ్మానుయేలు గట్టి గట్టిగా నేను ప్రేమించాను మేడం అంటూ రోజా పైకి వేలు ఎత్తి చూపిస్తూ అరిచాడు. ఇమ్మానుయేలు ఆ రకంగా వేలెత్తి చూపడంతో రోజా సీరియస్ అయి దించు అంటూ వార్నింగ్ ఇచ్చింది. రోజా అలా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇమ్మానుయేలు వేలెత్తి చూపించే సరికి రోజా చేయి విరిచి ఎక్కడ పెడతానో నాకే తెలియదు అనగానే ఒక్కసారి స్టేజ్ అంతా సైలెంట్ అయి మళ్లీ నార్మల్ స్థితికి వచ్చి అందరు నవ్వుకున్నారు. ఇక రోజా ఇమ్మానియేల్ మధ్య జరిగిన ఈ చిన్న వాదన కు సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *