ఆర్.పి. పట్నాయక్ అంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో అసలు పరిచయం అక్కరలేని పేరు.పని చేసింది కోన్ని సినిమాల్లోనే అయినా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఎంతో మంది ఎన్నో వందల సినిమాలకు పనిచేసిన దక్కని గుర్తింపు పట్నాయక్ గారికి కేవలం కొన్ని సినిమాలతోనే వచ్చింది. ఎంతో మంది సంగీత దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో కి వచ్చారు కానీ కొంత మంది మాత్రమే ఇంపాక్ట్ సృష్టించారు.వారికంటూ ప్రజలలో చెరిగి పోనీ ముద్రను వేసుకోగలిగారు.అలంటి వారి లిస్ట్ లో పట్నాయక్ గారు కూడా తప్పకుండ ఉంటారు.అంతలా తన పాటలతో ప్రజలను మైపరిపించగలిగాడు.
అలా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయినా ఆర్ పి పట్నాయక్ శ్రీరామ్, చిత్రం,హోలీ, సంతోషం, మనసంతా నువ్వే, నువ్వు నేను’,’జయం’ నీ స్నేహం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి తాను ఏంటో నిరూపించుకున్నాడు.అసలు ఈ సినిమాల విజయం లో వాటి పాటలే కీలక పాత్రను పోషించాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.పట్నాయక్ గారు కొన్ని పాటలకు తన స్వరాన్ని కూడా అందించాడు.
అయితే అలంటి అద్భుతమైన మ్యూజిక్ మరియు పాటలను అందిస్తూ తన కెరీర్ మంచి ఊపులో ఉన్నపుడు సడెన్ గా ఆర్పీ పట్నాయక్ గారు తాను మ్యూజిక్ డైరెక్షన్ నుండి తప్పుకుంటున్నట్లు షాకింగ్ ప్రకటన చేసాడు. అప్పట్లో టాలీవుడ్ లో పనిచేసేవారినందరిని ఈ నిర్ణయం షాక్ కి గురి చేసింది.అయితే తాను ఆ నిర్ణయం తీసుకోడానికి టాలీవూడ్ కి సంబంధించిన ఓ బడా హీరో అని అర్ధం అవుతుంది.
హీరో నాగార్జున నటించిన ‘నేనున్నాను’ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీనే ఆర్పీ పట్నాయక్ తెలుగు మూవీ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం అట. అయితే నాగార్జున నటిస్తున్న ఈ సినిమా కు సంగీత దర్శకుడి గా పని చేస్తూ రెండు సాంగ్స్ కి కంపోసింగ్ కూడా పూర్తి చేసి అమెరికా లో ఓ ప్రోగ్రాంకు ఆహ్వానం రావడం తో పట్నాయక్ గారు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట.అయితే తాను ఇలా అమెరికా వెళ్తున్నాని గాని వెళ్లి వచ్చాక ఏ సినిమా యొక్క ట్యూన్స్ సంగతి చూద్దామని గాని ఒక మాటైనా చెప్పకుండా ఆయన ఆలా అమెరికాకు వెళ్లిపోవడం. ఈ విషయాన్ని అతను కనీసం అతని మేనేజర్ మరియు చిత్ర యూనిట్‌కు చెప్పలేదు. దాని కారణంగా అతను ఇండియాకు తిరిగి చేరుకున్నాకా జరగాల్సినదంతా జరిగిపోయింది.
యుఎస్ నుండి తిరిగి వచ్చిన అతని దగ్గరకు ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ పెద్దాయన వచ్చి, నీ వలన బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతోంది కాబట్టి నేనున్నాను సినిమా నుండి నన్ను తప్పించేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. దాంతో ఇక ఎప్పటికి తన వలన ఎవరూ అసలు ఇబ్బంది పడకూదనే కేవలం ఆ ఒకే ఒక్క ఉద్దేశంతో అతను పూర్తిగా సినిమాలకు దూరమైనట్లు ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా తానే చెప్పుకొచ్చాడు.