ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే సినిమా అభిమానుల ప్రతి ఒక్కరి దృష్టి మొత్తం దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి గారు తెరక్కెక్కిస్తున్న RRR మూవీ పైనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తోంది. అయితే రాజమౌళి ఇప్పటికే తెరకెక్కించిన గత చిత్రాలల్లోలాగే ఈ సినిమా కూడా ఆయా కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది.అయిన కూడా అన్ని పనులను చక చక పూర్తి చేసుకొని ఈ వచ్చే అక్టోబర్ నెలలో విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా ఈ మూవీపై వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాలపై రియాక్ట్ అయ్యారు రాజమౌళి తండ్రి మరియు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్.
పీరియాడికల్ డ్రామాగా అభిమానుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ పాత్రకు సంబంధించి వదిలిన ఓ పోస్టర్ మరియు వీడియోలో ఎన్టీఆర్ తలపై ముస్లింలకు సంభందించిన టోపీ ధరించడం వివాదాన్ని క్రియేట్ చేసింది.అయితే ఈ విషయం పై కొమురం భీమ్ వారసులు మరియు తెలంగాణ కు చెందిన కొంతమంది చరిత్రకారులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ వివాదం పై స్పందించిన రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందరికి క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ..” కొమురం భీమ్ బ్రతికున్నప్పుడు అతన్ని పట్టుకోవడానికి నిజాం ప్రభువులు యత్నించారని, అయితే అతను నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం టోపి పెట్టుకొని ఒక ముస్లిం యువకుడిగా తన వేశాన్ని మార్చుకుంటాడు.” అని సినిమాలోని ఒక సన్నివేశాన్ని వివాదం కారణంగా రాజేంద్రప్రసాద్ బయట పెట్టేసాడు. అయితే హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని RRR యొక్క కథను రాశామని ఆయన అన్నారు. రాజమౌళి రూపొందించే ఏ రెండు చిత్రాలనూ ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లే ఉంటాయి అని చెప్పిన ఆయన బాహుబలికి మరియు RRRకు మధ్య అసలు పోలికే ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రాజమౌళి అలా చేసాడు అందుకే RRR నుండి తప్పుకున్నాం
RRR సినిమా పోస్టర్ పై రాజమౌళి కి షాక్
రిలీస్ అవ్వకముందే ‘బాహుబలి’ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన RRR..!
బాబోయ్..రాజమౌళికి ఆర్ఆర్ఆర్ మూవీ నచ్చక మళ్ళీ రీషూట్
అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ అంటే సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించి రూపొందిస్తున్నారు. బడా నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా సీనియర్ హీరోయిన్ శ్రీయ ఒక కీలకపాత్రలో కనిపించనుంది.