బాబోయ్..రాజమౌళికి ఆర్ఆర్ఆర్ మూవీ నచ్చక మళ్ళీ రీషూట్ చేస్తున్నాడట..!?

News

భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు రాజమౌళి సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఆయ‌న దర్శకత్వంలో తెరకెక్కిన ఏ చిత్రం అయినా సరే అది కచ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మనలో దాదాపు ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఇప్ప‌టికే బాహుబ‌లి అనే రెండు వరుస చిత్రాలతో రాజమౌళి ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ తో మరోసారి అన్ని రికార్డులను తిరగరాయాలని సన్నద్ధమవుతున్నాడు.

అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కబోతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో నటించనున్నారు.అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఇతర ప్రముఖ పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్ మరియు స్వతంత్ర సమరయోధలు అల్లూరి సీతారామరాజు జీవితాలను బేస్ చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ.

ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా ఉంటున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్ర నిర్మాతలు “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అనే పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ వీడియో చూస్తుంటే ఇందులో సన్నివేశాలు, స్టంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ వీడియో ద్వారా ఈ చిత్రం లో రెండు పాటలు తప్పించి షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, వచ్చే నెల ఆగస్టులో సినిమా యొక్క పూర్తి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, అక్టోబ‌ర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు దర్శకుడు మరియు నిర్మాతలు పేర్కొన్నారు.

అయితే ఈ మూవీలోని కొన్ని సీన్స్ చూసిన రాజ‌మౌళి సంతృప్తి చెందలేదని తెలుస్తోంది కాబట్టి ఈ చిత్ర హీరోలను రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ని మ‌ళ్లీ సెట్స్‌కి రమ్మన్నాడట. వారిద్ద‌రితో రెండు మూడు రోజుల పాటు కొన్ని కీలకమైన సీన్స్ను మరోసారి తిరిగి షూట్ చేసి షూటింగ్ పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి ముందే మిగిలిన ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేసి ఆ త‌ర్వాత సాంగ్స్ షూట్ చేయ‌నున్నాడ‌ట‌.

RRR రిలీస్ అయ్యేది ఆ రోజే

రాజమౌళి నెక్స్ట్ మూవీ లో హీరో మహేష్ బాబు

రాజమౌళి తండ్రి తో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ

RRR సినిమా పోస్టర్ పై రాజమౌళి కి షాక్

రిలీస్ అవ్వకముందే ‘బాహుబలి’ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన RRR..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *