sachin-joshi

చేసిన పాపం ఊరికే పోదు,వారు కర్మ అనుభవించక తప్పదు.!’ శిల్ప శెట్టి,రాజ్ కుంద్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సచిన్ జోషి.!

News

ఇటీవల అశ్లీల సినిమాలు తీసిన కేసులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి గారి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ షాక్ నుండీ అతను ఇంకా పూర్తిగా బయటపడకముందే ఇప్పుడు అతనికి మరో షాక్ ఎదురైంది. సత్యయుగ్‌ గోల్చ్ స్కీమ్‌ అనే ఒక కేసులో రాజ్‌కుంద్రా పై ప్రముఖ నటుడు సచిన్‌ జోషి కోర్ట్ లో ఆ కేసు గెలవడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి ఇద్దరు కలిసి సత్యయుగ్ గోల్డ్ స్కీంలో సచిన్ ను మోసం చేశారని ఆరోపిస్తూ అతను ఈ సంవత్సరం జనవరిలో వారిపై కేసు పెట్టాడు.

అయితే తాజాగా వచ్చిన వార్తల ప్రకారం కోర్టు మోసపోయిన నటుడు సచిన్ జోషి తరపున అనుకూలంగా తీర్పునిచ్చింది.సచిన్ కి చెందవలసిన కేజీ బంగారాన్ని అతనికి అప్పగించింది.ఇది మాత్రమే కాకుండా కోర్టు ఖర్చులకు గాను సచిన్ కు మూడు లక్షల రూపాయలను ఇవ్వాలని ముంబై హైకోర్టు రాజ్‌కుంద్రాని డిమాండ్ చేసింది.అయితే రీసెంట్ గా ఈ విషయం పై హీరో సచిన్‌ జోషి రియాక్ట్ అవుతూ ‘నేను 6 సంవత్సరాల నుండీ ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆ డబ్బుని మోసం చేసి నాదగ్గర్నుండి కాజేయాలని చూశారు. నా 18 లక్షలు విలువ చేసే బంగారాన్ని తిరిగి ఇవ్వమని నేను వారిని అడిగినప్పుడు వారు మళ్ళీ రివర్స్ లో నన్నే రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు.

ఆ వీడియోల రేటు.. ధర, ఎవరితో డీల్ చేశారో

వీడియో కాల్‌లో అలా ఆడిషన్‌ ఇవ్వమన్నారు.

ఏ కష్టం చేయరు మీకు డబ్బు ఎలా వస్తుంది.?

ఇది ఏమైనా నా బంగారాన్ని నాకు కావాలని కోరితే రివర్స్‌లో వారు నా పైనే బురద చల్లారు.నిజమే కదా చేసిన పాపాలు ఎక్కడికిపోతాయ.? వారు చేసిన మోసాలకు కర్మ అనుభవించక తప్పదు.నేనొక్కడిను మాత్రమే కాదు శిల్పాశెట్టి మరియు రాజ్ కుంద్రా బాధితులు బయట ఇంకా చాలామంది ఉన్నారు’ అంటూ అతను ఇక ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఇప్పటికే ఒక కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న టైం లో మొత్తానికి శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా దంపతులకు ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రాజ్ కుంద్రాని ఇంకా రిమాండ్‌ లో మరో 3 రోజుల పాటు ఉంచబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.