తాజాగా మెగా స్టార్ మేనల్లుడి ఏక్సిడెంట్ గురించి ఏ న్యూస్ ఛానల్ చూసిన ఒకే వార్త తో ఒక ఛానెల్ నీ మించి మరొకటి ప్రసారం చేస్తూ ఉన్నాయి అయితే ఈ సమయం లో అసలు వార్త తో పాటు కొన్ని అవాస్తవాలని కూడా కొంత మంది ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటి వల్ల అభిమానులు కలవర పడుతూ ఉన్నారు. వాస్తవ కథనం లోనికి వెళ్తే.
శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ కె.బి.అర్ పార్క్ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా ఐకియ వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు తాను నడుపుతున్న బైక్ నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవ్వడం తో బైక్ పైన ఉన్న సాయిధరమ్ తేజ్ ను కొంత దూరం వరకు ఇడ్చి కెల్లి గాయాల పాలు చేసింది. అలా బైక్ మీద నుండి పడగానే గాయాలు లోతుగా తగల కున్న ఏక్సిడెంట్ కి గురి కావడం వల్ల సాయధరమ్ తేజ్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. తాను అపస్మారక స్థితికి వెళ్లిన విషయం పూర్తి సినీ ఇండస్ట్రీ నీ సడెన్ షాక్ కి గురి చేసింది.
ఆక్సిడెంట్ జరిగిన స్థలం లో హుట హుటిన ప్రజల సహకారం తో సాయిధరమ్ తేజ్ ను మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయనను సందర్శించడానికి మెగా ఫ్యామిలీ అంతా కదిలి రావటం మనం న్యూస్ లో చూశాము. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ యొక్క మెడ బాగం లో విరిగిన ఏముక విషయం లో శాస్త్ర చికిత్స కొరకు డాక్టర్ల యొక్క పరియ వెక్షణలో ఉన్నారు.
అయితే పరిస్థితులు ఇలా ఉండగా కొంత మంది ఆయన బైక్ ను గురించ్చి ఆరా తీస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ అవాస్తవాలని నమ్మొద్దని ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
అసలు వాస్తవలోకి వెళ్తే సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ట్రైయంఫ్ కంపెనీకి చెందింది బైక్ను కొద్ది నెలల క్రితం స్వయంగా సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లో ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ బైక్ చాలా మంది స్పోర్ట్స్ బైక్ అని భావిస్తున్నారు కానీ ఈ విధమైన స్పెసిఫికేషన్ ఉన్న బైక్ లు సాధారణ రోడ్ల పైన నడిపించే పర్మిట్ ఉంది ఒక వేళ కంప్లీట్ గా స్పోర్ట్స్ బైక్ అయినట్టైతే సాధారణ రోడ్ల మీద నడిపించే పర్మిట్ ఉండేది కాదు అని ప్రముకులు అంటున్నారు.
సాయిధరమ్ తేజ్ ఆ బైక్ ను ఈ ఏడాది ఏప్రిల్ రెండోవారం అంటే సరిగ్గా ఐదు నెలల క్రితం సుమారు 18 లక్షలతో కొనుగోలు చేశాడు. ఈ బండి టి.ఎస్ 07 జి.జే. 1258 నెంబర్ తో అనిల్ కుమార్ బురా పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇది స్పోర్ట్స్ కేటగిరీ లో వచ్చే బైక్ సుమారు 1160సీసీ తో హై ఎండ్ బైక్ అని చెప్పాలి క్షణాల్లో కనిపించనంత వేగంగా దూసుకెళ్లటం ఈ బైక్ స్పెషాలిటీ.
ఈ బైక్ ను ఎంతో ఇష్టం గా కొన్నాడు సాయి ధరమ్ తేజ్ కానీ దురదృష్టవశాత్తు అదే బైక్ వల్ల ఏక్సిడెంట్ కు గురయ్యాడు. ఆక్సిడెంట్ జరిగాక పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ ఆదారం గా బైక్ నియంత్రణ కోల్పోవడం ద్వారానే సాయి ధరమ్ తేజ్ ఈ విధంగా ఏక్సిడెంట్ కి గురి అయ్యారని రయదుర్గ్ పోలీసులు దర్యాప్తులో తెలిపారు.