గత కొన్ని వారాల కిందట బైక్ యాక్సిడెంట్ కి గురై అపస్మారక స్థితిలో కొంత కాలము ఉండి అటు కుటుంబ సభ్యులను ఇటు అభిమానులను కలవరపెట్టి ఇప్పుడే ఇప్పుడే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు థియేటర్లలో ఫుల్ ఆక్యుపెన్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సరికి రిపబ్లిక్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో థియేటర్లలో రిపబ్లిక్ సినిమా మంచి టాక్ అందుకుంది.

ఇది ఇలా ఉండగా సాయి ధరంతేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.
అందుకు కారణం సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ఒక అమ్మాయి తో ప్రేమ లో ఉన్నట్టు తెలియడమే. ఆ అమ్మాయి ఎవరో కాదు తిక్క సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన లారిస్సా బోనేసి అని అర్థమవుతుంది.
బ్రెజిలియన్ మోడల్ మరియు లాటిన్ అమెరికన్ బ్యూటీ లారిస్సా గత కొంత కాలం గా సాయి ధరమ్ తేజ్ విషయంలో జరిగిన యాక్సిడెంట్ గురించి స్పందించకుండా సైలెంట్ గా ఉండి పోయిన అమే.
తాజాగా బాహ్య ప్రపంచానికి తెలిసే రీతిగా సాయి ధరమ్ తేజ్ గురించి వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే లారిస్సా మరియు సాయి ధరం తేజ్ నిజంగానే ప్రేమలో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
లారిస్సా రిపబ్లిక్ సినిమా విడుదల రోజున నా తేజు నటించిన రిపబ్లిక్ డే సినిమా ఈరోజు విడుదల అవుతుంది అంటూ పోస్టు రాసి లవ్ సింబల్ కలిపి ట్వీట్ పోస్ట్ చేసింది , అదేగాక ఐ మిస్ యు తేజ్ అంటూ మరో ట్వీట్ చేసింది, ఈ రెండు ఇట్లా తర్వాత ఐ యామ్ ఇన్ లవ్ అంటూ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేకెత్తించింది. దీంతో తో లారిస్సా సాయి ధరమ్ తేజ్ తో ప్రేమ లో ఉన్నట్టు నెటిజనులు ఫిక్స్ అయిపోయారు.
ట్వీట్ల ద్వారా వైరల్ గా ఉంటున్న ఈ వ్యవహారం కొలిక్కి రావాలంటే మెగా కుటుంబంలో నుండి ఎవరో ఒకరు స్పందిస్తే గాని ఎలాంటి క్లారిటీ ఉండదు. కానీ పరిణామాలు ఏవి ఈ విషయంపై స్పందించే రీతిగా లేవు , సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి విషయం కంటే ఎక్కువుగా షూటింగ్ లో పాల్గొన్న బోతున్నాడని టాక్ వినిపిస్తోంది