రీసెంట్ గా విడుదలైన ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. జనాల్లో మంచి స్పందన వస్తుండడంతో ఈ చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది.ఈ సినిమాలో నటించిన అందరికి విమర్శకుల దగ్గర్నుండి ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఎంతో సంతోషంగా ఉన్న ఈ చిత్ర యూనిట్ వెంటనే ఆ మూవీలో అతి కీలక పాత్రలో యాక్ట్ చేసిన సాయికుమార్ గారితో చిన్న ఇంటర్వ్యూ లాంటిది పెట్టి మాట్లాడించారు.అయితే ఆ ఇంటర్వ్యూ లో సాయి కుమార్ గారు మాట్లాడ్తూ ఎన్నో ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అయితే చిరంజీవి గారు అంటే తనకు ఎంత అభిమానమో చాలా సార్లు ఎన్నో ఇంటర్వూస్ లో స్వయంగా చెప్పడం చూసాం. అయితే మరోసారి ఈ వేధికగా సినిమా యొక్క సక్సెస్ లో కూడా హీరోను మెగాస్టార్ గారితో పోల్చుతూ అనేకమైన ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ ఆ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు అన్నారు. అయితే కొంతమందికి హీరోలు వెంకటేష్ ,నాగార్జున లాంటి వారు కూడా సినిమా సినిమాకి మెచూరిటీ పెంచుకుంటూ వచ్చారు అని జ్ఞాపకం చేసాడు.
అయితే నందమూరి బాల కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటన వారి బ్లడ్ లోనే ఉంది అన్నారు సాయి కుమార్. అంతే కాదు నందమూరి హీరోలలో నేను ఇంతవరకు భయాన్ని చూడలేదు అని చెప్పారు. ఎటువంటి ఆక్షన్ సీన్ ఐన కూడా భయం లేకుండా చేస్తుంటారు అని చెప్పాడు.
అతను ఇంకా మాట్లాడుతూ నందమూరి హీరోలందరితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. నందమూరి తారక రామారావు తో తన మేజర్ చంద్రకాంత్ సినిమా విషయాలు కూడా ఈ సందర్బంగా పంచుకున్నాడు సాయికుమార్. ఎన్టీఆర్ గారు ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అతను అసలు దేనికి భయపడని వ్యక్తి అని అన్నారు.
మేజర్ చంద్రకాంత్ శూతిన్ టైం లో ఎన్టీఆర్ తనని కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంది అయితే ఎన్టీఆర్ వెంటనే లేచి వీడు ఎంతా నాకు పిచ్చుక లాంటి వాడు అని చెప్పి ఒక్క దెబ్బతో నన్ను కింద పడగొట్టేసాడు అని చెప్పారు, అంతే కాదు దాదాపు 70 ఎల్లా వయసులోనూ అతను డూప్ లేకుండా ట్రాక్టర్ పైనుంచి దూకి విల్లన్ ను కొట్టే ఫైట్ సీన్ ను చేయడం చూసి నిజంగా చాలా ఆశ్చర్య పోయాను అని అన్నాడు సాయి కుమార్. అయితే అంతటి గొప్ప గొప్ప నటుల స్థానం లో చిరంజీవి గారు తన పేరును రాసుకున్నాడు అంటే నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అని ఆ ఇంటర్వ్యూ లో మరోసారి చిరంజీవి గారి పై తనకున్న అభిమానాన్ని బయట పెట్టాడు సాయి కుమార్.