samantha-about-pretham-jukalker

ప్రీతమ్ జుకల్కర్ తో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

News

సుమారుగా కొన్ని నెలల పాటలు ప్రతి టీవీ న్యూస్ ఛానల్ మరియు సోషల్ మీడియాలో వరుస కదనాలు మరియు రకరకాల పోస్టుల ద్వారా నాగచైతన్య సమంతల విడాకుల విషయం కట్టలు తెంచుకొని ప్రజల మధ్యలో వైరల్ గా నిలిచాయి.

అభిమానులలో ఎంతోమంది వారి శ్రేయస్సు కోరి విడిపోవద్దు అని ఎంతో కోరుకున్నప్పటికీ నాగచైతన్య సమంతా లు సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్న సంగతి బయలు పరిచారు.

అయితే తాము విడిపోయిన తర్వాత వారి గురించిన వార్తలు రావటం మాత్రం మానలేదు , వారెందుకు విడిపోయారో తెలుసుకోవాలనే కోణంలో రకరకాల వార్తలు విడుదలవుతున్నాయి.

samantha-about-pretham-jukalker

వాటిలో ముఖ్యమైనవి సమంతా క్యారెక్టర్ పరంగా చెడ్డది అన్నట్టు వచ్చిన పోస్టులే చాలామట్టుకు విడుదలయ్యాయి.

అయితే తాజాగా సమంత మరియు తన పర్సనల్ డిజైనర్ అయినటువంటి ప్రీతం కలిసి దిగిన ఫోటోల వల్ల ఒక సంచలనాత్మకమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ప్రితంను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సమంత నాగచైతన్య కు విడాకులు ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతోంది. ఈ విషయాలు వింటున్న అభిమానులు సమంత పైన పీకల్లోతు కోపంగా ఉన్నారని తెలుస్తుంది, విడాకులు జరిగి కొంత కాలం కాలేదు అప్పుడే పెళ్లికి సిద్ధమైనది అంటూ ఘోరంగా సమంతపైన మండిపడుతున్నారు.

సమంత తన గ్లామర్ చెడిపోతుందని పిల్లలు కనలేదని మరియు తన వస్త్రధారణ అక్కినేని కుటుంబాన్ని అవమానపరిచే రితిగా ఉంది అని వచ్చిన వార్తలను గుర్తు చేసుకుంటూ సమంతా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

అయితే ఇదే విషయంపై తాజాగా సమంత స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ వాల్ పోస్ట్ ద్వారా తన పైన వస్తున్నా నిందితులకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసింది.

విడాకులు అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం, విడాకులు తీసుకోవడం వల్ల నేను ఎంతో బాధ పడుతున్నాను , ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కనీసం కొంత మందైన నాకు అండగా ఉంటారని అని అనుకున్నాను కానీ. నా అనుకున్న వాళ్లు నన్ను అర్థం చేసుకోకుండా దారుణంగా ట్రోలింగ్ చేస్తు , నాకు అఫైర్ ఉండి పిల్లలను కావాలని కన్న లేదని అంటు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వార్తలు నన్ను చాలా బాధ పెడుతున్నాయని , దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *